న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గౌరవం పెరిగింది: ఫెదరర్‌ను అడ్డుకున్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు సచిన్ ప్రశంస

Sachin Tendulkar hails security officer for stopping Roger Federer from entering locker room

హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు ఎదురైన చేదు అనుభవంపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో స్పందించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో భాగంగా శనివారం అక్రిడేషన్ పాస్ మర్చిపోయినందుకు గాను రోజర్ ఫెదరర్‌ను డ్రెస్సింగ్‌ రూంలో వెళ్లకుండా అక్కడి సిబ్బంది అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లవ్ మ్యాచ్: అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే!ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లవ్ మ్యాచ్: అందరి దృష్టి ఆ ఇద్దరిపైనే!

ఇందుకు సంబంధించిన వీడియోని ఆస్ట్రేలియన్ ఓపెన్ తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. రోజర్ ఫెదరర్‌కి కూడా అక్రిడేషన్ కావాలంటూ ట్వీట్ చేసింది. ఈ వీడియోపై సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్‌లో "ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెక్యూరిటీ ఆఫీసర్ తన పనిని సక్రమంగా నిర్వర్తించాడు. ఇది చూసేందుకు మంచిగా ఉంది. అదే సమయంలో ఫెదరర్ స్పందించిన తీరు బాగుంది. ఇలాంటి సన్నివేశాలు ఈరోజుల్లో చాలా అరుదు. ఇలాంటి వాటితో ఫెదరర్ లాంటి గ్రేట్ అథ్లెట్‌పై గౌరవం మరింతగా పెరుగుతుంది" అని ట్వీట్ చేశాడు.

అక్రిడేషన్ పాస్ లేకపోవడంతో

అక్రిడేషన్ పాస్ లేకపోవడంతో

అక్రిడేషన్ పాస్ లేకపోవడంతో ఫెదరర్ తన సపోర్ట్ సిబ్బంది వచ్చే వరకు అక్కడే వేచి ఉండాల్సి పరిస్థితి తలెత్తింది. అందరితో పాటే రోజర్ ఫెదరర్ ఓపికగా నిలబడగా.. ఆయన కోచ్ ఇవాన్ జుబిసిస్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఆయన ఐడీ కార్డ్ చూపించిన తర్వాత గానీ ఫెదరర్‌ను ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు లోపలికి అనుమతిచలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు, కోచ్‌లు, అధికారులు, మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. ఐడీ కార్డులు లేకపోవడంతో ఆటగాళ్లను నిలిపేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో మరియా షరపోవాను కూడా ఐడీ కార్డు కోసం కారిడార్లో నిలిపేశారు.

ప్రీక్వార్టర్స్‌లోనే రోజర్ ఫెదరర్ ఇంటిముఖం

ప్రీక్వార్టర్స్‌లోనే రోజర్ ఫెదరర్ ఇంటిముఖం

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రీక్వార్టర్స్‌లోనే రోజర్ ఫెదరర్ ఇంటిముఖం పట్టాడు. హోరాహోరీ పోరులో డిఫెండింగ్ చాంపియన్ ఫెదరర్‌కు షాకిస్తూ గ్రీస్‌ కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తొలి మూడు రౌండ్‌లలో అలవోకగా ప్రత్యర్థుల ఆట కట్టించిన స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాత్రం మట్టికరిచాడు. తన అనుభవమంత (21 ఏళ్లు) వయసు లేని 20 ఏళ్ల గ్రీస్‌ కుర్రాడు స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ చేతిలో ఫెదరర్‌ ఓటమిపాలయ్యాడు.

ఊహించని షాకిచ్చిన సిట్సిపాస్‌

వరుసగా మూడోసారి... రికార్డు స్థాయిలో ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన రోజర్ ఫెదరర్‌కు తన కెరీర్‌లో కేవలం ఆరో గ్రాండ్‌స్లామ్‌ ఆడుతోన్న సిట్సిపాస్‌ ఊహించని షాకిచ్చాడు. 3 గంటల 45 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 14వ సీడ్‌ సిట్సిపాస్‌ 6-7 (11/13), 7-6 (7/3), 7-5, 7-6 (7/5)తో మూడో సీడ్‌ ఫెడరర్‌పై గెలిచాడు. ఫలితంగా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన తొలి గ్రీకు ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించడానికి ఫెదరర్‌కు చాలా అవకాశాలే వచ్చాయి. 12 బ్రేక్‌ పాయింట్‌ అవకాశాలు రాగా అన్నింటినీ వృథా చేశాడు. అద్భుతంగా ఫోర్‌హ్యాండ్‌ షాట్లు ఆడే ఫెదరర్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం లయ తప్పాడు. కీలక సమయాల్లో పేలవ ఫోర్‌హ్యాండ్‌ షాట్లు ఆడాడు.

12 ఏస్‌లు కొట్టిన రోజర్ ఫెదరర్

ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్‌ 20 ఏస్‌లు కొట్టగా.. ఫెదరర్‌ 12 ఏస్‌లు సంధించాడు. అంతేకాదు కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ మాత్రమే చేశాడు. మరోవైపు ఫెదరర్‌ 12 ఏస్‌లు కొట్టినా... 12 బ్రేక్‌ పాయింట్‌ అవకాశాల్లో ఒక్కటీ సద్వినియోగం చేసుకోకపోవడం గమనార్హం. 55 అనవసర తప్పిదాలు చేసిన ఫెదరర్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు. మ్యాచ్ అనంతరం సిట్సిపాస్‌ మాట్లాడుతూ "ఈ అనుభూతిని చెప్పడానికి నా వద్ద మాటలు లేవు. ఈ భూమి మీద ఇప్పుడు అందరికన్నా సంతోషంగా ఉన్నది నేనే. నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి ఫెడరర్‌ను ఆరాధిస్తున్నాను. మరో దిగ్గజం రాడ్‌ లేవర్‌ పేరిట ఉన్న సెంటర్‌ కోర్టులోనే ఫెదరర్‌తో ఆడే అవకాశం రావడంతో నా కల నిజమైంది. ఈ ఫలితాన్ని ఎలా వర్ణించాలో కూడా మాటలు రావడంలేదు" అని సిట్సిపాస్‌ అన్నాడు.

Story first published: Monday, January 21, 2019, 13:45 [IST]
Other articles published on Jan 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X