Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెన్నిస్ అభిమానులకు షరపోవా క్రిస్‌మస్ సర్‌ప్రైజ్

Russian tennis star maria sharapova celebrate christmas in her home

హైదరాబాద్: ఆటతో కంటే అందంతోనే ఎక్కువ అభిమానులను సంపాదించుకున్న టెన్నిస్ స్టార్లలో రష్యన్ టెన్నిస్ స్టార్ మారియా షరపోయా ఒకరు. షరపోవాకు ప్రపంచంలోనే అత్యంత అందమైన క్రీడాకారిణుల్లో ఒకరిగా గుర్తింపు పొందింది. గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయిన టెన్నిస్‌ కోర్టులో పెద్దగా రాణించలేకపోతున్న ఈ మాజీ వరల్డ్ నంబర్ వన్ తమ అందంతో అభిమానుల మది పోగుడుతూనే ఉంది.

31 ఏళ్ల వయసులో కూడా షరపోవా ఎంతో ఫిట్‌గా కనిపిస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో బికినీ ఫోటోలను పోస్ట్ చేసి ఒక్కసారిగా అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. డిసెంబర్ 25 క్రిస్‌మస్‌ను పురస్కరించుకుని షరపోవా షాపింగ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. క్రిస్‌మస్ రోజున "నేను సాధారణంగా తొందరగా పడుకుంటాను... కానీ ఈరోజు క్రిస్మస్ అందుకే మధ్యరాత్రిదాకా లేచున్నా... వెయిటింగ్ ఫర్ యూ సాంటా క్లాజ్" అంటూ షరపోవా కామెంట్ పెట్టింది. ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌గా నిలిచిన మారియా షరపోవాకి యూత్‌లో బాగా పాపులారిటీ ఉంది.

సోషల్ మీడియాలో సైతం షరోవాపకు ఫాలోవర్స్ సంఖ్య 3.4 మిలియన్లకు పైనే ఉంది. గతంలో ఫ్యాన్స్ ఫేవరెట్ ప్లేయర్‌గా, మోస్ట్ ఫ్యాషనబుల్ ప్లేయర్‌గా, సెక్సీయెస్ట్ ఉమెన్ ప్లేయర్‌గా అవార్డులను కూడా అందుకుంది. పలు అంతర్జాతీయ బ్రాండ్స్‌కు సైతం షరపోవా అంబాసిడర్‌గా వ్యవహారిస్తోంది.

Story first published: Thursday, December 27, 2018, 19:46 [IST]
Other articles published on Dec 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+