For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక రోజు ఖాళీ సమయం దొరకడంతో రోహిత్, దినేశ్ కార్తీక్ ఏం చేశారో తెలుసా?

Rohit Sharma, Dinesh Karthik watch Rafa Nadal at Australian Open on day off

హైదరాబాద్: కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరిస్‌లో రెండు వన్డేలు పూర్తయ్యాయి. ఇప్పటికే ముగిసిన ఈ రెండు వన్డేల్లో చెరో జట్టు ఒక్కో మ్యాచ్ నెగ్గడంతో సిరిస్ 1-1తో సమం అయింది. ఈ సిరిస్‌లో చివరిదైన మూడో వన్డే మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 18న జరగనుంది.

మూడో వన్డేకు ముందు ఒక రోజు ఖాళీ సమయం దొరకడంతో టీమిండియా క్రికెటర్లు రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, విజయ్ శంకర్ టెన్నిస్ మ్యాచ్ చూశారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భాగంగా మాజీ వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్ మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌కు ఈ ముగ్గురు క్రికెటర్లు వచ్చారు.

ఇందుకు సంబంధించిన ఫొటోను రోహిత్ శర్మ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. స్థానిక ప్లేయర్ మాథ్యూ ఎబ్డెన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ 6-3, 6-2, 6-2తో గెలిచాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో రోహిత్ సెంచరీ చేయగా.. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ విజయంలో దినేశ్ కార్తీక్ కీలకపాత్ర పోషించాడు.

Story first published: Thursday, January 17, 2019, 9:16 [IST]
Other articles published on Jan 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+