
నాటింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడా సంరంభంలో భారత్‌కు శుక్రవారం నాడు రెండో స్వర్ణం దక్కింది. టెన్నిస్ డబుల్స్‌లో రోహన్ బోపన్న-దివిజ్ శరణ్‌ల జోడి స్వర్ణాన్ని దక్కించుకుంది. రెండో గేమ్ పూర్తి చేసుకున్న ఈ జోడి ప్రత్యర్థిపై 5-3తేడాతో గెలుపొందింది. దీంతో మొత్తం 22 పతకాలను గెలుచుకున్న భారత్.. స్వర్ణం 6, రజితం 4, కాంస్యం 12 సొంతం చేసుకుంది. కాగా, భారత్ ఖాతాలో శుక్రవారం ఇది నాలుగో పతకం.
జరిగిన ఫైనల్లో కజక్‌స్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ బుబ్లిక్, డెనిస్ యెవెసెయెవ్ జోడీపై 6-3, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి సెట్‌లో రెండు సర్వీస్‌లను బ్రేక్ చేసిన భారత జోడీ.. రెండో సెట్‌లోనూ కీలకసమయంలో సర్వీస్ బ్రేక్ చేసి సునాయాస విజయం సాధించింది.
పోటీల్లో భాగంగా రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జోడీ సెమీఫైనల్లో జపాన్‌పై విజయం సాధించింది. 4-6తో తొలి సెట్‌ను బోపన్న జోడీ చేజార్చుకుంది. ఆ తర్వాత పుంజుకున్న బోపన్న జోడీ 6-3తో రెండో సెట్‌ను కైవసం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్ పోరు హోరాహోరీగా సాగింది. చివరికి 10-8తో బోపన్న జోడీ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది.