Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్‌లో శుభారంభం చేసిన ఫెదరర్, కొత్త కాంట్రాక్ట్ రూ.2 వేల కోట్లు

Roger Federer: Wimbledon opponents should be frightened if this is true - John McEnroe

హైదరాబాద్: వింబుల్డన్‌లో స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ శుభారంభం చేశాడు. లండన్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్ కప్ టెన్నిస్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ సోమవారం జరిగిన మొదటి రౌండ్‌లో టాప్‌ సీడ్‌ ఫెదరర్‌ 6-1, 6-3, 6-4తో లజోవిచ్‌ (క్రొయేషియా)ను ఓడించాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది ఏస్‌లు కొట్టిన రోజర్‌.. ఐదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. సెర్బియా క్రీడాకారుడు, మాజీ వరల్డ్ నెంబర్ 57 డసన్ లజోవిక్‌ను 61, 6-3, 6-4 తేడాతో 79 నిమిషాల్లో ఓడించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.

తొలి రౌండ్‌లో 20వ సారి గెలిచి:

తొలి రౌండ్‌లో 20వ సారి గెలిచి:

ఫెదరర్ వింబుల్డన్ టోర్నీ మొదటి రౌండ్‌లో గెలుపొందడం ఇది 20వ సారి. ఒక సెర్బియా క్రీడాకారుడిని వింబుల్డన్‌లో ఫెదరర్ రెండోసారి ఓడించాడు. ఈ సందర్భంగా ఫెదరర్ మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యాచ్ ప్రారంభంలో తాను కొంత ఇబ్బంది పడ్డానని, తర్వాత పుంజుకుని విజయం సాధించానని అన్నాడు. ఫెదరర్ రెండోరౌండ్‌లో స్లవాకియాకు చెందిన లుకాస్ లకావో లేదా ఫ్రెంచ్ బెంజమిన్ బోంజీతో తలపడతాడు.

ఒప్పందం విలువ సుమారు రూ. 2 వేల కోట్లు:

ఒప్పందం విలువ సుమారు రూ. 2 వేల కోట్లు:

రెండు దశాబ్దాలుగా ప్రఖ్యాత ‘నైకీ' సంస్థతో కొనసాగిస్తున్నఅనుబంధానికి ఫెదరర్‌ తెరదించాడు. కొత్తగా జపాన్‌కు చెందిన ‘యునిక్లో'తో ఒప్పందం కుదుర్చుకుని.. తొలిసారి వింబుల్డన్‌ మ్యాచ్‌లో ఆ సంస్థకు చెందిన కిట్‌తో బరిలోకి దిగాడు. పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం విలువ సుమారు 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2 వేల కోట్లు) వరకు ఉందని సమాచారం.

రిటైర్‌ అయినా అతనికి అంతే డబ్బు

రిటైర్‌ అయినా అతనికి అంతే డబ్బు

ఇప్పటి వరకూ నైకీ ఇస్తున్నదానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. కాంట్రాక్ట్‌లో ఉన్న నిబంధన ప్రకారం ఫెదరర్‌ ఆటగాడిగా రిటైర్‌ అయినా అతనికి అంతే డబ్బు లభిస్తుంది. అయితే ఫెదరర్‌ సొంత బ్రాండ్‌ ‘ఆర్‌ఎఫ్‌' హక్కులు మాత్రం ఇంకా నైకీ వద్దనే ఉన్నాయి. అయితే తన పేరుతో ఉన్న బ్రాండ్‌ కాబట్టి ఇప్పుడు కాకపోయినా... మరి కొద్ది రోజుల తర్వాత దాని హక్కులు తనకే దక్కుతాయని ఈ స్విస్‌ స్టార్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.

తొలి రౌండ్‌లోనే వెనక్కు తగ్గిన యుకీ బాంబ్రీ

తొలి రౌండ్‌లోనే వెనక్కు తగ్గిన యుకీ బాంబ్రీ

భారత ఆటగాడు యుకీ బాంబ్రీ కథ తొలి రౌండ్‌లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో థామస్‌ ఫాబియానో (ఇటలీ) 2-6, 6-3, 6-3, 6-2తో బాంబ్రీని ఓడించాడు. 2 గంటల 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో యుకీ తొలి సెట్‌ గెలుచుకోగలిగినా... ఆ తర్వాత చేతులెత్తేశాడు. రోనిచ్‌ (కెనడా) 7-5, 6-0, 6-1తో బ్రాడీ (ఇంగ్లాండ్‌)ను ఓడించగా.. క్వెరె (అమెరికా) 6-2, 6-4, 6-3తో థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. ఆరోసీడ్‌ దిమిత్రోవ్‌.. వావ్రింకా చేతిలో ఓడాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) కూడా విజయం సాధించి ముందంజ వేశాడు. సిలిచ్‌ 6-1, 6-4, 6-4తో నిషియోకా (జపాన్‌)ను ఓడించాడు. అతనితో పాటు జాన్‌ ఇస్నర్‌ (అమెరికా), గర్సియా లోపెజ్‌ (స్పెయిన్‌), కార్లోవిచ్‌ (క్రొయేషియా), అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) కూడా తొలి రౌండ్‌ దాటారు.

Story first published: Tuesday, July 3, 2018, 10:34 [IST]
Other articles published on Jul 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+