
కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్:
ఈ ఏడాది అద్భుత ఆటతీరు కొనసాగిస్తూ సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆరోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జకో 6-7 (4/7), 6-4, 6-4, 6-3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ మాటియో బెరెటిని (ఇటలీ)పై గెలుపొందడం ద్వారా తన కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు. దీంతో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా రోజర్ ఫెడరర్ (20), రాఫెల్ నాదల్ (20) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. సెప్టెంబర్‌లలో జరిగే యూఎస్ ఓపెన్‌లోనూ గెలిస్తే రాడ్ లేవర్ (1969లో) తర్వాత క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్ ఘనత సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు.

2008లో తొలి గ్రాండ్‌స్లామ్:
2005లో జొకోవిచ్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బరిలో దిగాడు. అప్పటికే ఫెదరర్ నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. 2003లో తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడిన నాదల్.. 2005లో తొలి టైటిల్ నెగ్గాడు. అప్పుడే ఆటలోకి వచ్చిన జకోకు ఫెదరర్, నాదల్ నుంచి గట్టిపోటీ ఎదురైంది. మూడేళ్లు గడిచినా గ్రాండ్‌స్లామ్ టోర్నీ గెలవలేకపోయాడు. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్‌లో కీలక మ్యాచుల్లో పరాజయాలు ఎదురయ్యాయి. 2008లో ఓ గ్రాండ్‌స్లామ్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్ల పాటు మళ్లీ నిరాశే. మరింత బలంగా పుంజుకున్న జకో.. 2011 నుంచి ఫెదరర్, నాదల్‌పై పైచేయి సాధించడం ప్రారంభించాడు. ఫెదరర్, నాదల్‌లను ఓడిస్తూ టైటిళ్లు సాధించడం అలవాటు చేసుకున్నాడు. 2018 నుంచి జకో జోరుకు బ్రేకులే లేకుండా పోయాయి. గత 14 గ్రాండ్‌స్లామ్‌ల్లో ఏకంగా 8 గెలుచుకున్నాడు. చివరకు దిగ్గజాల సరసన చేరాడు.

జొకోవిచ్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్:
ఆస్ట్రేలియన్ ఓపెన్ (9): 2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021
ఫ్రెంచ్ ఓపెన్ (2): 2016, 2021
వింబుల్డన్ (6): 2011, 2014, 2015, 2018, 2019, 2021
యూఎస్ ఓపెన్ (3): 2011, 2015, 2018

నాదల్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్:
ఆస్ట్రేలియన్ ఓపెన్ (1): 2009
ఫ్రెంచ్ ఓపెన్ (13): 2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020
వింబుల్డన్ (2): 2008, 2010
యూఎస్ ఓపెన్ (4): 2010, 2013, 2017, 2019

ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్:
ఆస్ట్రేలియన్ ఓపెన్ (6): 2004, 2006, 2007, 2010, 2017, 2018
ఫ్రెంచ్ ఓపెన్ (1): 2009
వింబుల్డన్ (8): 2003, 2004, 2005, 2006, 2007, 2009, 2012, 2017
యూఎస్ ఓపెన్ (5): 2004, 2005, 2006, 2007, 2008


Click it and Unblock the Notifications












