న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అగ్రస్థానంలో ఫెదరర్‌.. 66వ స్థానంలో కోహ్లీ!!

Roger Federer tops Forbes 2020 list of the worlds 100 highest-paid athletes

లండన్‌: ప్రపంచంలోనే అత్యధిక ధనార్జన కల్గిన అథ్లెట్‌గా స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ నిలిచాడు. ఫోర్బ్స్‌ శుక్రవారం ప్రకటించిన జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. టాప్‌-100 క్రీడాకారుల జాబితాలో ఫెడరర్‌ ఐదో స్థానం నుంచి ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకాడు. ఫోర్బ్స్‌ పత్రిక విడుదల చేసిన టాప్‌-100 క్రీడాకారుల జాబితాలో భారత్‌ నుంచి టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది.

అథ్లెట్‌ కిరణ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం!!అథ్లెట్‌ కిరణ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం!!

ఫోర్బ్స్‌ కింగ్‌ ఫెదరర్‌:

ఫోర్బ్స్‌ కింగ్‌ ఫెదరర్‌:

2019 జూన్‌ నుంచి 2020 జూన్‌ కాలానికి రోజర్‌ ఫెడరర్‌ మొత్తం 10 కోట్ల 63 లక్షల డాలర్లు (రూ. 803 కోట్లు) సంపాదించాడు. ఇందులో 10 కోట్ల డాలర్లు ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చాయి. మిగతా 63 లక్షల డాలర్లు టోర్నీలు ఆడటం ద్వారా గెల్చుకున్న ప్రైజ్‌మనీ. గత ఏడాది కాలానికి గాను ఈ టెన్నిస్‌ కింగ్‌ 106.3 మిలియన్ల డాలర్లు(రూ.803 కోట్లు) సంపాదించాడు. ఫోర్బ్స్‌ జాబితాలో ఒక టెన్నిస్‌ ప్లేయర్‌ అగ్రస్థానంలో నిలువడం ఇదే తొలిసారి.

రొనాల్డో@2:

రొనాల్డో@2:

కరోనా కారణంగా వేతనాల్లో కోత పడడంతో సాకర్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో రూ. 800 కోట్లు (105 మిలియన్‌ డాలర్లు), లియోనెల్‌ మెస్సీ రూ. 790 కోట్లు (104 మిలియన్‌ డాలర్లు) వరుసగా రెండు, మూడు స్థానాలకు పడిపోయారు. బ్రెజిల్‌ సాకర్‌ హీరో నేమార్‌ రూ. 722 కోట్లు (95.5 మిలియన్‌ డాలర్లు), ఎన్‌బీఏ స్టార్‌ లెబ్రాన్‌ జేమ్స్‌ రూ. 666 కోట్లు (88.2 మిలియన్‌ డాలర్లు) నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. మొత్తం 100 మంది జాబితాలో 35 మంది బాస్కెట్‌బాల్‌ ఆటగాళ్లు ఉన్నారు.

ఇద్దరు మహిళలకు మాత్రమే చోటు:

ఇద్దరు మహిళలకు మాత్రమే చోటు:

టాప్‌-100 క్రీడాకారుల జాబితాలో ఇద్దరు మహిళలకు మాత్రమే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా టెన్నిస్‌ స్టార్లు నవోమి ఒసాక (జపాన్‌), అమెరికా నల్ల కలువ సెరెనా విలియమ్స్‌. ఒసాక రూ. 282 కోట్ల (37.4 మిలియన్‌ డాలర్లు)తో 29వ స్థానంలో నిలవగా.. సెరెనా విలియమ్స్‌ రూ. 272 కోట్ల (36 మిలియన్‌ డాలర్లు)తో 33వ స్థానాన్ని దక్కించుకుంది. గత 12నెలల కాలంలో ఆటగాళ్లు ఆర్జించిన మొత్తాన్ని లెక్కించి ఈ జాబితాను రూపొందించారు.

 ఏకైక క్రికెటర్ కోహ్లీ:

ఏకైక క్రికెటర్ కోహ్లీ:

ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల టాప్‌-100 జాబితాలో భారత్‌ నుంచి విరాట్‌ కోహ్లీకి మాత్రమే చోటు లభించింది. ఫోర్బ్స్‌ జాబితాలో రూ. 196 కోట్ల ఆదాయంతో భారత కెప్టెన్ 66వ స్థానంలో నిలిచాడు. గత ఏడాదితో పోలిస్తే.. విరాట్ 34 స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. కోహ్లీకి ఎండార్స్‌మెంట్ల ద్వారా 2 కోట్ల 40 లక్షల డాలర్లు లభించగా.. 20 లక్షల డాలర్లు ప్రైజ్‌మనీ, వేతనం ద్వారా వచ్చాయి. టాప్‌-100లో నిలిచిన ఏకైక క్రికెటర్, భారత్‌ నుంచి ఏకైక క్రీడాకారుడు కోహ్లీనే కావడం విశేషం.

Story first published: Saturday, May 30, 2020, 11:33 [IST]
Other articles published on May 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X