బాసెల్ (స్విట్జర్లాండ్): స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఫ్రెంచ్ ఓపెన్ నుండి తప్పుకున్నారు. తాజాగా కుడి మోకాలికి శస్త్రచికిత్స జరగడంతో నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే 38 ఏళ్ల ఫెడరర్.. ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్ మాత్రమే కాదు వచ్చే నాలుగు నెలల్లో జరిగే దుబాయ్ ఓపెన్, ఇండియన్ వెల్స్ ఓపెన్, బొగోటా ఓపెన్, మయామి ఓపెన్ టోర్నీలకు దూరం కానున్నారు.
వందవ టెస్ట్ మ్యాచ్.. టేలర్‌కు వంద వైన్ బాటిళ్లు (వీడియో)!!
ఫ్రెంచ్ ఓపెన్ సహా ఐదారు టోర్నీలకు అందుబాటులో ఉండటం లేదని తాజాగా ఫేస్బుక్ వేదికగా ఫెడరర్ తెలిపాడు. 'గత కొంతకాలంగా కుడి మోకాలి నొప్పితో బాధపడుతును. గాయానికి వివిధ రకాల మెడికేషన్ తీసుకున్నా. అయితే శస్త్రచికిత్స చేయక తప్పని పరిస్థితి వచ్చింది. స్విట్జర్లాండ్‌లోనే తాజాగా సర్జరీ చేయించుకున్నా. కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకోక తప్పదు అని డాక్టర్లు చెప్పారు' అని ఫెడరర్ పేర్కొన్నారు.
సరైన సమయంలో సర్జరీని డాక్టర్లు చేశారు. ప్రస్తుతం బాగానే ఉన్నాను. త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటా. గాయం కారణంగా దుబాయ్ ఓపెన్, ఇండియా వెల్స్, బొగోటా, మయామి, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలకు దూరమవుతున్నా' అని ఫెడరర్ తెలిపారు. వింబుల్డన్ టోర్నీ లోపు ఫెడరర్ కోలుకునే అవకాశమున్నట్లు సమాచారం తెలుస్తోంది. అత్యధిక గ్రాండ్‌స్లామ్ (20) సాధించిన ప్లేయర్ రికార్డు ఫెడరర్ పేరిటే ఉన్న విషయం తెలిసిందే.
గత నెలలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా ఫెడరర్ గాయంతో బాధపడిన విషయం తెలిసిందే. సెమీఫైనల్ మ్యాచ్‌లో సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ చేతిలో 7-6 (7/1), 6-4, 6-3 వరుస సెట్లలో ఓడిపోయాడు. ఇక క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 6-3, 2-6, 2-6, 7-6 (10/8), 6-3 తేడాతో వందో ర్యాంకు ఆటగాడు టెన్నిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై మూడున్నర గంటలు పోరాడి గెలిచాడు.