స్వీట్ గర్ల్: సానియాపై ఫెదరర్, సచిన్ అంటే ఇష్టం
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెన్నిస్ ప్రపంచంలో సానియా తన సత్తా చాటడం ప్రారంభించిన తర్వాత ఇండియాలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిందని ఫెదరర్ వ్యాఖ్యానించాడు.
ఐపీటీఎల్ పోటీల్లో పాల్గొనేందుకు భారత్ వచ్చిన ఫెదరర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తాను 2014లో సానియాతో కలిసి మిక్స్ డ్ డబుల్స్ ఆడానని, అప్పటికే ఆమెతో పరిచయం ఉందని, ఆమె ఓ 'స్వీట్ గర్ల్' అని అన్నాడు.

మార్టీనా హింగీస్‌తో కలసి సానియా వింబుల్డన్ డబుల్స్ ఫైనల్‌లో అద్భుత ఆటతీరు కనబరిచిందని ప్రశంసించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు.
వీడియోగేమ్ క్రికెట్ ఆడుతుంటే, తన జట్టులో సచిన్ ఉండాల్సిందేనని అన్నాడు. ఐపిటిఎల్ ద్వారా భారతదేశానికి వచ్చే అవకాశం మరోసారి లభించడం ఎంతో సంతోషంగా ఉందని ఫెదరర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications