100వ టైటిల్‌తో ఈ ఏడాదిని ముగించాలని ఆశించిన ఫెదరర్‌కు షాక్

హైదరాబాద్: స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌కు అతిపెద్ద షాక్. కెరీర్లో 100వ టైటిల్‌తో ఈ ఏడాదిని ముగించాలని ఆశించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఈ సీజన్ చివరి టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. 'లీటన్ హెవిట్ గ్రూప్'లో భాగంగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ఫెదరర్ 6-7 (4/7), 3-6తో కీ నిషికోరి (జపాన్) చేతిలో ఓటమిపాలయ్యాడు.

ఆరుసార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఫెదరర్
రికార్డు స్థాయిలో ఆరుసార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఫెదరర్ జపాన్ ఆటగాడు నిషికోరితో జరిగిన మ్యాచ్‌లో తడబడ్డాడు. 87 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ నాలుగు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌లో ఇద్దరూ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది.

7-4తో తొలి సెట్‌ను గెలుచుకున్న నిషికోరి
టై బ్రేకర్‌లో మొదటి నుంచి దూకుడు ప్రదర్శించి 6-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన నిషికోరి 7-4తో తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. ఇక, రెండో సెట్‌లో 20 అనవసర తప్పిదాలు చేసిన ఫెదరర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. రెండో సెట్‌లోని తొలి గేమ్‌లోనే నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెదరర్ ఆ వెంటనే తన సర్వీస్‌ను చేజార్చుకున్నాడు.

ఫెదరర్ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్ చేసిన నిషికోరి
ఆరో గేమ్‌లో ఫెదరర్ సర్వీస్‌ను రెండోసారి బ్రేక్ చేసిన నిషికోరి ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని సెట్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ మొత్తంలో ఫెదరర్ 34 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. ఈ ఓటమితో సెమీస్ చేరే అవకాశాన్ని ఫెదరర్ సంక్లిష్టం చేసుకున్నాడు.

మరో మ్యాచ్‌లో అండర్సన్‌పై డోమ్నిక్ థీమ్‌పై విజయం
ర్యాంకింగ్‌లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న ఆటగాళ్లను రెండు గ్రూపులుగా విడదీసి ఎటీఎఫ్ ఫైనల్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇదే గ్రూప్‌లోని మరో మ్యాచ్‌లో కెవిన్ అండర్సన్ 6-3, 7-6 (12-10)తో డోమ్నిక్ థీమ్‌పై విజయం సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications