Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫెదరర్, సెరెనాల పేర్లు టెన్నిస్‌లో నిలిచిపోతాయ్: ఎవర్ట్

Roger Federer and Serena Williams are the greatest of all time in tennis: Chris Evert

హైదరాబాద్: అమెరికా మాజీ టెన్నిస్ ప్లేయర్ అయిన క్రిస్ ఎవర్ట్ ప్రస్తుత ప్లేయర్లైన ఫెదరర్, సెరెనాలను టెన్నిస్ రంగంలో నిలిచిపోయే క్రీడాకారులంటూ తెగ పొగిడేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి అమెరికా నుంచి వీడియో కాల్‌లో సమావేశంలో పాల్గొన్నారు.

ఆమె ఇప్పటికీ సింగిల్స్ విభాగంలో కెరీర్‌లో 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నారు. ఇంకా, డబుల్స్ విభాగంలో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు, ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్‌లో ఏడు సార్లు ఛాంపియన్ షిప్‌లు, యూఎస్ ఓపెన్ లో ఆరు సార్లు విజేతగా నిలిచారు.

ఆవిడ 63 ఏళ్ల వయసులోనూ టెన్నిస్‌లో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉన్నారు. చాలా కాలం తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్న ఆవిడ భావోద్వాగానికి గురైయ్యారు.

ప్రస్తుతం ఆడుతున్న క్రీడాకారులలో ఆమెకు రోజర్ ఫెదరర్, సెరెనా విలియమ్స్ అంటే విపరీతమైన అభిమానం అంటూ పేర్కొన్నారు. అదెలా అంటే ముప్పై ఏళ్లు పైబడ్డాక కూడా వాళ్లు ఆటలో రాణిస్తున్న తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు.

ఇంకా మాట్లాడుతూ, రోజర్ ఫెదరర్ ఆట అంటే కేవలం శరీరంతోనే కాదు. అతను మానసికంగాను బాగా ఫీలై ఆడతాడు. అదే కారణం కావచ్చు. ఈ తరం క్రీడాకారులందరిలో ఫెదరర్‌నే అభిమానించే ప్రత్యేకత కలిగి ఉంటాడని కితాబిచ్చారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 12, 2018, 16:14 [IST]
Other articles published on Jan 12, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+