Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియన్ ఓపెన్: 35ఏళ్లలో అదే జోరు, ఫైనల్స్‌లో ఫెదరర్

హైదరాబాద్: మాజీ వరల్డ్ నెంబర్ వన్ రోజర్ ఫెదరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన సెమీఫైన‌ల్లో నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకాపై ఐదు సెట్ల పాటు పోరాడి విజ‌యం సాధించాడు. మూడు గంట‌ల‌కు పైగా సాగిన ఈ మ్యాచ్‌లో 7-5, 6-3, 1-6, 4-6, 6-3 తేడాతో ఫెద‌ర‌ర్ విజయం సాధించాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఫెద‌ర‌ర్‌ తొలి రెండు సెట్లు గెలిచి సునాయాసంగా ఫైన‌ల్ చేరేలా క‌నిపించాడు. అయితే మూడో సెట్‌లో వావ్రింకా ఒక్కసారిగా చెలరేగి ఆడాడు. మూడో సెట్‌లో ఫెద‌ర‌ర్ స‌ర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి 6-1తో వావ్రింకా విజయం సాధించాడు.

ఇక నాలుగో సెట్ తొలి సర్వీస్‌నే కోల్పోయిన ఫెదరర్, ఆ తర్వాత పుంజుకొని వావ్రింకా స‌ర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఇక కీల‌క‌మైన తొమ్మిదో గేమ్‌లో మ‌రోసారి ఫెదరర్ సర్వీస్‌ని బ్రేక్ చేసిన వావ్రింకా గెలుపొందాడు. ఇక ఫెదరర్ విజయానికి కారణమైన చివరి సెట్‌లో చెలరేగి ఆడాడు.

Roger Federer reaches into Australian Open final

కీల‌క స‌మ‌యంలో వావ్రింకా స‌ర్వీస్‌బ్రేక్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. చివ‌రి వరకు లీడ్‌ను కొన‌సాగిస్తూ 6-3తో సెట్‌ని కైవసం చేసుకుని మ్యాచ్ కూడా సొంతం చేసుకున్నాడు. గతేడాది గాయంతో బాధ‌ప‌డిన ఫెద‌ర‌ర్‌ ఇప్పుడు 35 ఏళ్ల వ‌య‌సులో ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ ఫైనల్ చేరడం ఓ సంచలనమైంది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌ విభాగంలో తొమ్మిదో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), 15వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) సెమీఫైనల్లోకి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 6-4, 7-6 (9/7), 6-4తో మూడో సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)ను ఓడించగా, దిమిత్రోవ్‌ 6-3, 6-2, 6-4తో 11వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)పై గెలిచాడు.

దీంతో నాదల్, దిమిత్రోవ్‌ మధ్య రెండో సెమీఫైనల్‌ శుక్రవారం జరుగుతుంది. శనివారం దిమిత్రోవ్‌, నాదల్ మ‌ధ్య జ‌రిగే రెండో సెమీస్ విజేత‌తో రోజర్ ఫెద‌ర‌ర్ ఆదివారం ఫైన‌ల్లో త‌ల‌ప‌డ‌నున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+