Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫెదరర్‌కు షాక్‌: వారంలోపే నంబర్ వన్ ర్యాంక్‌ని కోల్పోయాడు

Roger Federer meets his match in Borna Coric: Halle Open final

హైదరాబాద్: కెరీర్‌లో 99వ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకున్న స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు నిరాశ ఎదురైంది. జర్మనీలోని హాలె వెస్ట్‌ఫాలెన్‌ వేదికగా జరిగిన హాలె ఓపెన్ టోర్నీ ఫైనల్లో రోజర్ ఫెదరర్‌కు క్రొయేషియా స్టార్‌ బోర్నా కోరిచ్ షాకిచ్చాడు.

హాలె ఓపెన్ టైటిల్‌ను పదోసారి నెగ్గాలనే లక్ష్యంతో ఫైనల్‌ బరిలోకి దిగిన ఫెదరర్‌పై క్రొయేషియాకు చెందిన 21 ఏళ్ల బోర్నా కోరిచ్‌ 7-6(8/6), 3-6, 6-2తో విజయం సాధించాడు. రెండు గంటల ఆరు నిమిషాలపాటు జరిగిన ఫైనల్‌లో రోజర్ ఫెదరర్‌ను ఓడించాడు.

దీంతో ఫెదరర్ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను చేజార్చుకొని రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. గతవారమే రఫెల్ నాదల్ నుంచి మెర్సిడెస్‌ కప్‌ గెలిచిన ఫెదరర్ టాప్‌ ర్యాంక్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజా ఓటమితో నాదల్ తిరిగి నంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు.

కాగా, హాలె ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన కోరిచ్‌కు 4,27,590 యూరోలు (రూ. 3 కోట్ల 38 లక్షలు), రన్నరప్‌ ఫెదరర్‌కు 2,09,630 యూరోలు (రూ. కోటీ 65 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

Story first published: Monday, June 25, 2018, 11:31 [IST]
Other articles published on Jun 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+