For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాటలు రావట్లేదు, కఠినమైన క్రీడ: ఫెదరర్ భావోద్వేగం

ఫెదరర్‌కు తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం. మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో అదివారం టైటిల్ అందుకున్న అనంతరం ఫెదరర్ భావోద్వేగంతో మాట్లాడాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: 35 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకుని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రోజర్‌ ఫెదరర్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఫెదరర్‌కు తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావ‌డం విశేషం. మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో అదివారం టైటిల్ అందుకున్న అనంతరం ఫెదరర్ భావోద్వేగంతో మాట్లాడాడు.

'నాకు మాటలు రావట్లేదు. గత ఆరు నెలలు కఠినంగా సాగాయి. ఇప్పుడిలా ఈ స్థితిలో ఉంటానని వూహించలేదు. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే నాదల్‌ నన్ను చాలా ఏళ్లపాటు ఇబ్బందులకు గురి చేశాడు. నేను నాదల్‌ చేతిలో ఓడిపోయినా సంతోషంగానే ఉండేవాన్ని. టెన్నిస్‌ కఠినమైన క్రీడ. ఇక్కడ డ్రాలు ఉండవు' అని ఫెదరర్ అన్నాడు.

 Roger Federer gave such a classy speech after his historic Australian Open win

'అసాధారణ రీతిలో రీ ఎంట్రీ ఇచ్చిన రఫాకు అభినందనలు. మేమిద్దరం ఫైనల్‌కొస్తామని ఊహించలేదు. నాదల్ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. అలాంటివి ఉంటే ఈ రోజు రాత్రి డ్రాకు అంగీకరించి నాదల్‌తో ట్రోఫీని పంచుకునేవాడిని. నువ్విలాగే ఆడుతూ ఉండు. టెన్నిస్‌కు నీ అవసరం ఉంది' అని అన్నాడు.

'వచ్చే సంవత్సరం ఇక్కడికి వస్తాననే అనుకుంటున్నా. రాకుంటే మాత్రం ఈ సంవత్సరం జ్ఞాపకాలు జీవితాంతం తోడుంటాయి. నాకున్న గాయాల గురించి నాకు తెలుసు. ఐదేళ్ల అనంతరం ఓ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలవడం సంతోషాన్ని కలిగించింది. ఇక నాలో మిగిలివున్న టెన్నిస్ తక్కువే. మరో గాయం తగిలితే వచ్చే సంవత్సరం ఇక్కడికి రాలేకపోవచ్చు. ఏమో ఏం జరుగుతుందో. ఈ వయసులో అవకాశం దక్కించుకోవాలంటే ఎంత కష్టమో మీకూ తెలుసు' అని ఫెదరర్ చెప్పాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+