Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫెదరర్ అభిమాని: కోమా నుంచి కోలుకోగానే ఆశ్చర్యం

న్యూఢిల్లీ: టెన్నిస్ ఆటలో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు స్విస్ దిగ్గజ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్. 2004వ సంవత్సరంలో రోజర్‌ ఫెదరర్‌ ఏటీపీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి ర్యాంకు సాధించాడు. రోజర్ ఫెదరర్‌కు స్పానిష్‌కు చెందిన జీసస్ అపారిసియో వీరాభిమాని.

అదే ఏడాది డిసెంబర్ 12వ తేదీన తన 18వ పుట్టినరోజుని జరుపుకుంటూ జీసస్ అపారిసియో ఓ కారు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయాడు. 11 సంవత్సరాల తర్వాత ఇటీవలేకోమా నుంచి బయటకు వచ్చిన జీసస్ అపారిసియో రోజర్ ఫెదరర్ ఇంకా టెన్నిస్ ఆడటం గురించి విని ఎంతో సంతోషానికి లోనయ్యాడు.

పదకొండేళ్ల క్రితం నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఫెదరర్‌ ఇప్పటికీ రెండో ర్యాంకులో కొనసాగుతుండటం, ఇప్పటికే 17 గ్రాండ్‌ స్లామ్‌లు గెలుచుకోవడం లాంటి విషయాలు విని అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు. కోమా నుంచి బయటకు రాగానే రోజర్ ఫెదరర్ గురించి వాకబు చేశాడు.

Roger Federer fan wakes from 11-year-coma, is stunned he is still a major player

ఇప్పటికీ రోజర్ ఫెదరర్ గొప్పగా ఆడుతున్న విషయాన్ని తెలుసుకుని నిజంగా ఆశ్చర్యానికి గురయ్యానని టెన్నిస్ వరల్డ్ యుఎస్ఏ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు. అతను రిటైరయి ఉంటాడని అనుకుంటున్నానని, అప్పుడు ఫెదరర్‌ తోటి క్రీడాకారులైన ఆండ్రూ అగస్సీ, మరాట్‌ సాఫిన్‌, టిమ్‌హెన్‌మాన్‌ లాంటి టాప్‌ టెన్‌ ర్యాంకింగ్స్‌లో ఉన్న ఆటగాళ్లంతా రిటైరై పోయారు.

అయితే ఫెదరర్‌ మాత్రం ఇప్పటికీ అంతే బాగా ఆడుతున్నాడంటూ సంతోషపడ్డాడు. రోజర్ ఫెదరర్ రిటైర్మెంట్‌కు ముందుగా అతడి మ్యాచ్ చూడాలనుకుంటున్నానని, అది అతడి 18వ గ్రాండ్ స్లామ్‌కు వేదికగా నిలవాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+