For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2021: ప్రిక్వార్టర్స్‌లో ఫెదరర్‌.. గాఫ్‌, క్రెజికోవా ముందంజ! సానియా జోడీ ఔట్‌!

Roger Federer enters Wimbledon 2021 pre-quarterfinals, Sania-Bethanie pair crashes out

లండన్‌: వింబుల్డన్‌ 2021 గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. వింబుల్డన్‌ టోర్నీలో 22వ సారి ఆడుతోన్న 39 ఏళ్ల ఫెదరర్‌కు మూడో రౌండ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్‌ కామెరాన్‌ నోరీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్‌ 6-4, 6-4, 5-7, 6-4తో గెలుపొందాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్‌ లొరెంజో సొనెగో (ఇటలీ)తో ఫెడరర్‌ తలపడతాడు. ఈ విజయంతో పాంచో గొంజాలెస్‌ (అమెరికా-41 ఏళ్ల వయసులో; 1969లో), కెన్‌ రోజ్‌వెల్‌ (ఆస్ట్రేలియా-40 ఏళ్ల వయసులో; 1975లో) తర్వాత వింబుల్డన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన మూడో పెద్ద వయస్కుడిగా ఫెదరర్‌ గుర్తింపు పొందాడు.

నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఏడో సీడ్‌ బెరెటినీ (ఇటలీ) నాలుగో రౌండ్లో ప్రవేశించారు. మూడో రౌండ్లో జ్వెరెవ్‌ 6-7 (3-7), 6-4, 6-3, 7-6 (7-4)తో ఫ్రిట్జ్‌ (అమెరికా)ను ఓడించాడు. జ్వెరెవ్‌ 19 ఏస్‌లు, 45 విన్నర్లు కొట్టాడు. బెరెటిని 6-4, 6-4, 6-4తో బెడెన్‌ (స్లొవేనియా)పై విజయాన్ని అందుకున్నాడు. అగర్‌ అలియాసిమె (కెనడా)తో మ్యాచ్‌లో 6-2, 1-6తో ఉన్న దశలో కిర్గియోస్‌ (ఆస్ట్రేలియా) గాయంతో రిటైరయ్యాడు. హర్కజ్‌ (పోలెండ్‌) 6-3, 6-4, 6-2తో బబ్లిక్‌ (కజకిస్థాన్‌)పై, ఇవాష్క (బెలారస్‌) 6-4, 6-4, 6-4తో థాంప్సన్‌ (ఆస్ట్రేలియా)పై గెలుపొందారు. 2013, 2016 చాంపియన్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌) కథ మూడో రౌండ్‌లో ముగిసింది. పదో సీడ్‌ షపవలోవ్‌ (కెనడా) 6-4, 6-4, 6-2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ ముర్రేను ఓడించి తొలిసారి వింబుల్డన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు.

మహిళల సింగిల్స్‌లో 20వ సీడ్, అమెరికా టీనేజర్‌ కొకో గాఫ్‌ వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో గాఫ్‌ 6-3, 6-3తో కాయా యువాన్‌ (స్లొవేనియా)పై గెలిచింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్‌ ఆంజలిక్ కెర్బర్‌ (జర్మనీ) 2-6, 6-0, 6-1తో సస్నోవిచ్‌ (బెలారస్‌)పై.. 14వ సీడ్‌ క్రిచికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7-6 (7/1), 3-6, 7-5తో సెవస్తోవా (లాత్వియా)పై.. 19వ సీడ్‌ ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) 7-5, 6-3తో పావ్లుచెంకోవా (రష్యా)పై.. పౌలా బదోసా (స్పెయిన్‌) 5-7, 6-2, 6-4తో లినెట్టి (పోలాండ్‌)పై.. రదుకాను (బ్రిటన్‌) 6-3, 7-5తో క్రిస్టీ (రొమేనియా)పై నెగ్గారు.

మహిళల డబుల్స్‌ నుంచి సానియా మీర్జా, బెథానీ మాటెక్‌ (అమెరికా) జంట నిష్క్రమించింది. రెండో రౌండ్లో ఈ ద్వయం 4-6, 3-6తో రష్యా జోడీ ఎలెనా వెస్నినా, వెరోనికా కుదెర్మెతోవాల చేతిలో పరాజయం పాలైంది.

Story first published: Sunday, July 4, 2021, 9:14 [IST]
Other articles published on Jul 4, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+