అసలేమైంది?: చలికి వణుకుతూ ప్రయాణం చేస్తోన్న రోజర్ ఫెదరర్

హైదరాబాద్: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తాజాగా ఓ సరికొత్త సవాల్‌కు సిద్ధమయ్యాడు. తన ఏస్‌లతో ప్రత్యర్థులకు వణికించే రోజర్ ఫెదరర్ ప్రస్తుతం స్విస్ పర్వతాల్లో చలికి వణుకుతూ ప్రయాణం కొనసాగిస్తున్నాడు.

పర్వతాల్లో రోజర్ ఫెదరర్
రోజర్ ఫెదరర్ పర్వతాల్లో చలికి వణకడం ఏంటని అనుకుంటున్నారా? డిస్కవరి ఛానెల్ ఇండియా కోసం "రన్నింగ్ వైల్డ్ విత్ బియర్ గ్రీల్స్" రియాల్టీ షోలో భాగంగా ప్రముఖ సాహస యాత్రికుడు బియర్‌తో కలిసి ఫెదరర్ స్విస్‌లోని ఆల్ఫ్ పర్వతాల్లో కొన్ని రోజులు గడిపాడు.

కొత్త ఫెదరర్‌ను చూడనున్న అభిమానులు
దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్‌లో రోజర్ ఫెదరర్ ప్రయాణం ప్రసారం చేయనున్నారు. ఎప్పుడూ కోర్టులో టెన్నిస్ ఆడే ఫెదరర్‌ను చూసే అభిమానులకు ఇక్కడ కొత్త ఫెదరర్‌ను చూడనున్నారు. ఇందులో మంచుతో ఆడుతూ.. చేపలు తింటూ ఫెదరర్ సాగించిన ప్రయాణం టెన్నిస్ అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది.
స్విస్ పర్వతాల్లో నా చిరునామా దొరికింది
ఈ సందర్భంగా రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ "స్విస్ పర్వతాల్లో నా చిరునామా దొరికింది. మ్యాచ్‌కు ముందు ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నా పల్స్ రేటు పెరిగిపోతుంది. టెన్నిస్‌లో కఠినంగా కనిపించినప్పటికీ జీవితంలో చాలా విషయాల్లో నాకు భయం వేస్తుంది" అని చెప్పుకొచ్చాడు.

బియర్ నా చేయి పట్టుకొనే ఉండు
"పర్వతాల్లో గడపడం కూడా అలాంటిదే. బియర్ నా చేయి పట్టుకొనే ఉండు. కొన్ని భయపెట్టే సందర్భాలు ఎదురవుతాయని అనుకుంటున్నా. టెన్నిస్ నైపుణ్యాలు ఉపయోగపడుతున్నాయి" అని రోజర్ ఫెదరర్ వెల్లడించాడు. ఇటీవలే ముగిసిన యుఎస్ ఓపెన్‌లో రోజర్ ఫెదరర్ క్వార్టర్స్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications