For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Wimbledon 2021లో హర్కజ్‌ సంచలనం.. ఫెదరర్‌కు షాక్‌! సెమీస్‌లో జకోవిచ్‌, షపొవలోవ్‌!

Roger Federer crashes out of Wimbledon 2021, Maybe for the Last Time

లండన్‌: వింబుల్డన్‌ 2021లో సంచలనం నమోదైంది. ఎనిమిదిసార్లు చాంపియన్‌, స్విస్ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఘోర ఓటమిని ఎదుర్కొన్నాడు. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ క్వార్టర్స్‌ చేరిన పొలాండ్‌ యువ ఆటగాడు హుబర్ట్‌ హుర్కజ్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. తాను ఓ వెలుగు వెలిగిన సెంటర్‌ కోర్టు నుంచి ఫెదరర్‌ నిరాశగా వెనుదిరిగాడు. టాప్‌ సీడ్‌, సెర్బియా స్టార్ నొవాక్‌ జొకోవిచ్‌ పదోసారి వింబుల్డన్‌ సెమీస్‌ చేరాడు. యువ ఆటగాడు డెనిస్‌ షపొవలోవ్‌ కూడా క్వార్టర్‌ఫైనల్‌ దాటాడు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడి సానియా మీర్జా-రోహన్‌ బోపన్న అద్భుతంగా పోరాడినా ఫలితం లేకపోయింది.

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ చరిత్రలో అత్యధిక పురుషుల సింగిల్స్‌ టైటిళ్ల వీరుడు రోజర్‌ ఫెదరర్‌కు నిరాశ ఎదురైంది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లోఫెదరర్‌ 3-6, 6-7 (4/7), 0-6 తేడాతో 14వ సీడ్‌ హుబర్ట్‌ హుర్కజ్‌ (పొలాండ్‌) చేతిలో ఓడిపోయాడు. గంటా 48 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచులో స్విస్‌ దిగ్గజం కనీస పోరాటం కనబరచలేక ఘోర ఓటమి చవిచూశాడు. తొలి రెండు సెట్లు హోరాహోరీగా పోరాడిన ఫెదరర్‌.. చివరి సెట్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మ్యాచ్‌ మొత్తం 31 తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. గాయం కారణంగా ఇటీవల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఫెదరర్‌కు ఇదే చివరి వింబుల్డన్‌ కావొచ్చన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో ఫెదరర్‌, నాదల్‌ల రికార్డును సమం చేయాలనుకుంటున్న నోవాక్ జకోవిచ్‌ కూడా సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. జకో క్వార్టర్‌ఫైనల్లో 6-3, 6-4, 6-4తో హంగేరికి చెందిన మర్తోన్‌ ఫుక్సోవిచ్‌పై విజయం సాధించాడు. ఫామ్‌లో ఉన్న జకో తొలి సెట్లో 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అలవోకగా ఆ సెట్‌ను గెలుచుకున్న జకోవిచ్‌.. ఆ తర్వాత తన కూడా జోరు కొనసాగించాడు. తర్వాతి రెండు సెట్లలోనూ ఫుక్సోవిచ్‌ తడబడడంతో జకోవిచ్‌కు సునాయాస విజయం దక్కింది. 34 ఏళ్ల జకోవిచ్‌కు ఇది పదో వింబుల్డన్‌ సెమీఫైనల్‌. జకో కెనడాకు చెందిన 22 ఏళ్ల షపొవలోవ్‌ను ఢీకొంటాడు.

మరో క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో 10వ సీడ్‌ డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) 6-4, 3-6, 5-7, 6-1, 6-4తో కరెన్‌ కచనోవ్‌ (రష్యా)పై ఉత్కంఠ పోరులో గెలిచాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్లు సానియా మీర్జా-రోహన్‌ బోపన్న చివరి వరకు పోరాడి ఓడారు. సోమవారం వర్షంతో నిలిచిపోయిన మ్యాచ్‌ బుధవారం కొనసాగగా.. సానియా జోడి 3-6, 6-3, 9-11 తేడాతో 14వ సీడ్‌ జోడీ ఆండ్రెజా క్లెపాక్‌, జులెన్‌ రోజర్‌ ద్వయంపై ఓడిపోయారు.

Story first published: Thursday, July 8, 2021, 7:31 [IST]
Other articles published on Jul 8, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+