Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మోకాలి గాయం వేధిస్తోంది.. ఇంకా ఎన్ని రోజులు ఆడ‌తానో తెలియ‌దు'

Roger Federer could pull out of French Open 2021 with knee injury

పారిస్‌: మాజీ టెన్నిస్ నంబర్‌వన్, స్విట్జర్లాండ్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్ త‌న అభిమానుల‌కు ఓ చేదు వార్త చెప్పాడు. ప్రస్తుతం పారిస్‌లో కొనసాగుతున్న ఫ్రెంచ్ ఓపెన్‌ 2021లో తాను ఎన్ని రోజులు కొన‌సాగుతానో సరిగ్గా తెలియ‌ద‌ని 20 సార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్ విజేత ఫెడెక్స్ పేర్కొన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు విజయాలు సాధిస్తానని తాను అనుకోలేదని తెలిపాడు. ఆపరేషన్ తర్వాత మూడు గంటల 35 నిమిషాలు ఓ మ్యాచ్ ఆడటం సాధారణ విషయం కాదని ఫెడరర్ అన్నాడు. మోకాలి గాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్‌ 2021 నుంచి ఫెడెక్స్ తప్పుకోనున్నాడని సమాచారం తెలుస్తోంది.

ఫ్రెంచ్ ఓపెన్‌ 2021 పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో భాగంగా శ‌నివారం రాత్రి మూడున్న‌ర గంట‌ల పాటు జ‌రిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో రోజర్‌ ఫెద‌ర‌ర్‌.. 7-6, 6-7, 7-6, 7-5 తేడాతో 59వ ర్యాంక్ ప్లేయ‌ర్ డొమినిక్ కోఫ‌ర్‌పై అతికష్టం మీద విజయాన్ని అందుకున్నాడు. దీంతో 15వ సారి అతడు ప్రిక్వార్టర్స్‌ దశకు చేరాడు. ఇక సోమ‌వారం ఇట‌లీకి చెందిన మాటెయో బెరెటినితో నాలుగో రౌండ్‌లో 39 ఏళ్ల ఫెడెక్స్ త‌ల‌ప‌డాల్సి ఉంది. అయితే తాను ఆడ‌తానో లేదో తెలియ‌ద‌ని ఫెద‌ర‌ర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఫెడెక్స్ దాదాపు టోర్నీ నుంచి తప్పుకున్నట్లే.

'ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడు విజయాలు సాధిస్తానని అనుకోలేదు. ఆపరేషన్ తర్వాత మూడు గంటల 35 నిమిషాలు ఓ మ్యాచ్ ఆడటం సాధారణ విషయం కాదు. ఇక టోర్నీలో కొన‌సాగాలో వ‌ద్దో నేను నిర్ణ‌యించుకోవాలి. మోకాలిపై ఇంత‌టి భారం వేయ‌డం స‌రైన‌దో కాదో తెలియడం లేదు. రెస్ట్ తీసుకోవ‌డానికి ఇదే స‌రైన స‌మ‌య‌మా అన్నది ఆలోచిస్తున్నాను' అని ఫెడెక్స్ చెప్పాడు. స్విస్ మాస్ట‌ర్‌.. త‌న ఆల్‌టైమ్ ఫేవ‌రెట్ వింబుల్డ‌న్‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నాడు. జూన్ 28 నుంచి వింబుల్డ‌న్ ప్రారంభం కాబోతోంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగితే అతడికి వారం కూడా విశ్రాంతి దొరకదు.

గ‌తేడాది ఆరంభంలో రోజర్‌ ఫెద‌ర‌ర్ మోకాలికి రెండు స‌ర్జ‌రీలు జ‌రిగాయి. దీంతో చాలా వ‌ర‌కూ టోర్నీల‌కు అత‌డు దూరంగా ఉన్నాడు. జనవరి 2020లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నోవాక్ జొకోవిచ్ చేతిలో సెమీఫైనల్లో ఓడిపోయిన తరువాత ఖతార్‌ ఓపెన్‌ 2021లో మళ్లీ బరిలోకి దిగాడు. ఫెడరర్‌ దాదాపు 405 రోజులు తర్వాత కోర్టులోకి అడుగుపెట్టాడు. మ‌రో రెండు నెల‌ల్లో 40వ ఏట అడుగుపెడుతున్న ఫెడెక్స్‌కు.. టెన్నిస్‌లో వ‌స్తున్న యువకుల‌ను ఎదుర్కోవ‌డం స‌వాలుగా మారింది. ప్ర‌తి మ్యాచ్‌కు ముందు నా ప‌రిస్థితిని అంచ‌నా వేసుకుంటాను. నా మోకాలు ఎలా ఉందో చూసుకుంటాను. ఆ త‌ర్వాతే కొన‌సాగాలో వ‌ద్దో నిర్ణ‌యించుకుంటాను అని ఫెడెక్స్ అన్నాడు.

Story first published: Sunday, June 6, 2021, 12:57 [IST]
Other articles published on Jun 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+