Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్: 40 నిమిషాల పాటు లిప్ట్‌లో నరకయాతన

రియో డీ జనీరో: పురుషుల టెన్నిస్ విభాగంలో సంచలన విజయాన్ని నమోదు చేసిన అర్జెంటీనా టెన్నిస్ స్టార్ ఆటగాడు జాన్ మార్టిన్ టెల్ పోట్రోకి చేదు అనుభవం ఎదురైంది. ఒలింపిక్స్ గ్రామంలో ఓ బిల్డింగ్‌ లిప్ట్‌లో సుమారు 40 నిమిషాలు పాటు ఇరుక్కుపోయాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

ఒలింపిక్స్ రెండో రోజు ఆటల్లో భాగంగా ఆదివారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో డెల్ పాట్రో వరల్డ్ నెంబర్ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌పై 7-6, 7-6 తేడాతో విజయం సాధించి ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు. అంతేకాదు నొవాక్ జకో‌విచ్‌పై అతడి విజయం రియో ఒలింపిక్స్‌‌కే ఓ సంచలనంగా మారింది.

Rio Olympics: Argentine tennis star stuck in elevator for 40 minutes

పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధిస్తాడన్న అంచనాలతో బరిలోకి దిగిన వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్‌ తొలి రౌండ్‌లోనే ఓటమి పాలవ్వడం ఒలింపిక్ క్రీడాభిమానులను ఎంతో నిరాశకు గురి చేసింది. మ్యాచ్‌కి ముందు తాను లిప్ట్‌లో ఇరుక్కోవడం కాస్తంత అసహనానికి గురి చేసిందని పేర్కొన్నాడు.

లిప్ట్‌లో మొబైల్ ఫోన్ సిగ్నల్ కూడా సరిగా అందలేదని వెల్లడించాడు. లిప్ట్‌లో ఇరుకున్న సమయంలో డెల్ పాట్రో సాయం కోసం గట్టిగా అరిచాడు. చివరకు అర్జెంటీనాకు చెందిన హ్యాండ్ బాల్ జట్టు ఆటగాళ్ల సాయంతో తాను లిప్ట్ నుంచి బయటపడ్డాడు. లిప్ట్‌లో ఇరుకున్న సమయంలో తానెలాంటి అవస్థ పడిందో అభిమానులకు తెలియజేసేందుకు సెల్ఫీ తీసుకుని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+