Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పేస్ ఇంటి నుంచి గెంటేయాలని చూశాడు: రియా

ముంబై: బాంద్రాలోని ఇంటి నుంచి లియాండర్ పేస్ తనను బయటకు తోసేయాలని చూశాడని ఆయనతో సహజీవనం చేస్తున్న రియా పిళ్లై ఆరోపించారు. ఈ మేరకు ఆమె గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను లోనికి రానీయకుండా బయటకు గెంటేయాలని చూశారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో శుక్రవారం వార్తలు వచ్చాయి.

గురువారం రాత్రి ఓ పెళ్లికి వెళ్లిన రియా పిళ్లై కూతురిని అక్కడే వదిలేసి ఇంటికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంటి ముందు ఐదుగురు గుండాలు నిలబడి తనను ఇంట్లోకి అడుగు పెట్టనీయలేదని రియా ఆరోపించారు. హెల్ప్‌లైన్ ద్వారా ఆమె పోలీసులను పిలిచారు.

Rhea Pillai accuses Leander Paes of trying to evict her

ఆ తర్వాత 45 నిమిషాలకు పోలీసులు వచ్చి, ఆమెను లోనికి పంపించారు. ఆమె ఇంట్లోకి వెళ్లేసరికి లియాండర్ ఆమెకు చెందిన అన్ని వస్తువులను ప్యాక్ చేశాడని రియా స్నేహితురాలు చెప్పినట్లు హిందుస్తాన్ టైమ్స్ రాసింది.

కొన్ని నెలల క్రితం కూడా ఈ విధమైన చర్యకే పేస్ ఒడిగట్టినట్లు రియా చెప్పారని ఆ మీడియా రాసింది. కూతురును తన కస్టడీకి అప్పగించాలని లియాండర్ పేస్ ఇటీవల కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+