లియాండర్ పేస్ - రియా పిళ్లై
ఇప్పటికే తమ ఎనిమిదేళ్ల కుమార్తె కోసం రియా, పేస్ మధ్య ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో తన కుమార్తె రక్షణ బాధ్యతలు రియా నుంచి శాశ్వతంగా తనకే ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టులో పేస్ పిటిషన్ దాఖలు వేశారు. ఇప్పుడు నెలకు రూ.4 లక్షలు ఇవ్వాలని పిళ్లై డిమాండ్ చేస్తున్నారు.
లియాండర్ పేస్ - రియా పిళ్లై
నెలకు తన ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షలు, తన చిన్నారి ఖర్చుల కోసం రూ.90,000 ఇవ్వాలని రియా పిళ్లై తన పిటిషన్లో డిమాండ్ చేసింది.
లియాండర్ పేస్ - రియా పిళ్లై
లియాండర్ పేస్ గత రెండేళ్లుగా తమను ఆర్థికంగా ఆదుకోవడం లేదని ఆమె చెప్పారు. కాగా, ఈ విషయమై పేస్ జూన్ 30న కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
లియాండర్ పేస్ - రియా పిళ్లై
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని స్థానిక మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పేస్ పైన రియా గృహ హింస, వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ విషయాన్ని పేస్ తరపు న్యాయవాది మీడియాకు తెలిపారు. పేస్, అతని తండ్రి వేస్ పేస్ పైన రియా కేసు నమోదు చేసిందన్నారు.