Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుకీ కిందకి.. రామ్ కుమార్ పైపైకి..

Ramkumar achieves career-best ATP ranking, Yuki drops

హైదరాబాద్: భారత టెన్నిస్‌ ఆటగాడు రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌‌కు ఫిబ్రవరి 26 ప్రత్యేకమైన రోజు. ఇప్పటివరకు తనకున్న ర్యాంకింగ్స్ కంటే కెరీర్‌లోనే అత్యుత్తమమైన ర్యాంకును తాజా ఏటీపీ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో సాధించాడు. 23ఏళ్ల రామ్‌కుమార్ డెల్రే ఏటీపీ టోర్నీకి అర్హత సాధించడం ద్వారా 12పాయింట్లు ఖాతాలో వేసుకుని ఏడు స్థానాలు మెరుగుపర్చుకొన్నాడు. దీంతో 133వ స్థానంలో నిలిచాడు.

యుకీ బాంబ్రి దిగజారిపోయి:
భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ ఆటగాడు యుకి బాంబ్రి 4 స్థానాలు దిగజారి 105వ ర్యాంకుకు పడిపోయాడు. దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్‌షిప్‌కు యుకి అర్హత సాధించలేదు. యువ ఆటగాళ్లు సుమిత్‌ నాగల్ సైతం దుబాయ్ టోర్నీకి అర్హత సాధించలేకపోయాడు. ప్రజ్నేశ్‌ పది స్థానాలు పైకి వెళ్లి 232 వ స్థానం చేరుకోగా, సుమిత్ 220వ స్థానంలో ఉణ్నాడు.

డబుల్స్‌లో రోహన్‌ బోపన్న 20వ స్థానంలో కొనసాగుతున్నాడు. దివిజ్‌ శరణ్‌, లియాండర్‌ పేస్‌ చెరో మూడు స్థానాలు దిగజారి వరుసగా 54, 52 స్థానాల్లో నిలిచారు.

మహిళల విభాగంలో:
మహిళల సింగిల్స్‌లో ఇటీవల రాణించిన అంకిత రైనా తిరిగి టాప్‌ 250లో స్థానం పొందింది. కర్మన్‌ కౌర్‌ 281వ స్థానంలో కొనసాగుతోంది. మహిళల డబుల్స్‌లో గాయం కారణంగా విశ్రాంతి నిమిత్తం ఆటకు దూరంగా ఉన్న సానియా మీర్జా ఒక స్థానం మెరుగుపర్చుకొని 13వ ర్యాంకు సాధించింది.

Story first published: Tuesday, February 27, 2018, 8:02 [IST]
Other articles published on Feb 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+