న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Australian Open: నాద‌ల్ తీవ్ర భావోద్వేగం! చారిత్ర‌క విజ‌యానికి అడుగు దూరంలో..

Rafael Nadal was emotional after reaching the Australian Open final

మెల్‌బోర్న్‌: స్పెయిన్ బుల్ ర‌ఫెల్ నాద‌ల్ చ‌రిత్ర‌కు అడుగు దూరంలో నిలిచాడు. కెరీర్‌లో 21వ గ్రాండ్ స్లామ్ గెలిచి టెన్నిస్‌లో అత్య‌ధిక గ్రాండ్‌స్లామ్‌లు అందుకున్న ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించ‌డానికి నాద‌ల్‌కు కావాల్సింది ఇంకోక విజ‌యం మాత్ర‌మే. నేడు ఇట‌లీకి చెందిన ఏడో సీడ్ మాటియో బెరెటీనీతో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో గెలిచి నాద‌ల్ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్‌లో ఘ‌నంగా అడుగుపెట్టాడు. సెమీస్‌లో విజయం అనంతరం నాదల్ భావోద్వేగానికి గురయ్యాడు.

సెమీస్‌లో విజ‌యం

సెమీస్‌లో విజ‌యం

ఇట‌లీకి చెందిన మాటియో బెరెటీనీతో నేడు జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ర‌ఫెల్ నాద‌ల్ ఘ‌న‌విజ‌యం సాధించాడు. నాలుగు సెట్లపాటు జ‌రిగిన ఈ పోరులో 35 ఏళ్ల‌ నాద‌ల్ 6-3, 6-2, 3-6, 6-3 తేడాతో విజ‌యం అందుకోని ఆరో సారి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాడు. తొలి రెండు సెట్లలో నాద‌ల్ సునాయ‌సంగా గెలిచాడు. అయితే మూడో సెట్‌లో మాటియో బెరెటీనీ పుంజుకున్నాడు. దీంతో మూడో సెట్‌ను నాద‌ల్ 3-6తో కోల్పోవల్సి వ‌చ్చింది. కానీ ఇంత‌లోనే నాద‌ల్ మ‌ళ్లీ తిరిగి పుంజుకున్నాడు. నాలుగో సెట్‌లో మ‌ళ్లీ త‌న ప్ర‌తాపం చూపించాడు. ప్ర‌త్య‌ర్థికి ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా చెల‌రేగాడు. దీంతో కీల‌క‌మైన నాలుగో సెట్‌ను నాద‌ల్ 6-3తో కైవ‌సం చేసుకున్నాడు.

దీంతో సెట్‌తోపాటు నాద‌ల్ మ్యాచ్‌ను గెలిచి ఫైన‌ల్‌లోకి అడుగుపెట్టాడు. మొత్తం 2 గంట‌ల 56 నిముషాల‌పాటు ఈ మ్యాచ్ జ‌రిగింది. ఒక వేళ ఈ సెట్ కూడా నాద‌ల్ ఓడి ఉంటే ఫ‌లితం కోసం ఐదో సెట్ ఆడాల్సి వ‌చ్చేది. కానీ నాద‌ల్ నాలుగో సెట్ గెల‌వ‌డంతో 1, 2 సెట్‌ల విజ‌యాలు క‌లుపుకుని 3-1తో పూర్తి అధిక్యంలో నిలిచాడు. దీంతో నాద‌ల్ ఫైన‌ల్‌లో అడుగుపెట్టాడు. మ‌రో సెమీఫైన‌ల్ విజేత‌తో ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో నాద‌ల్ త‌ల‌ప‌డ‌నున్నాడు. కాగా రెండో సెమీఫైన‌ల్‌లో నాలుగో సీడ్ సిట్సిపాస్, రెండో సీడ్ మెద్వెదేవ్ త‌ల‌ప‌డ‌నున్నారు.

నాద‌ల్ భావోద్వేగం

కాగా సెమీఫైన‌ల్‌లో గెలిచిన అనంత‌రం ర‌ఫెల్ నాద‌ల్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. ఈ క్ర‌మంలో క‌న్నీళ్లు కార్చాడు. గెలిచిన వెంట‌నే ఓ బ్యాగుపై త‌న మోహాన్ని ఉంచుకుని నాద‌ల్ క‌న్నీళ్లు కార్చిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆ వీడియోలో నాద‌ల్ చొక్కా లేకుండా చ‌ప్ప‌ట్లు కొట్ట‌డాన్ని కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. విజ‌యం అనంత‌రం మాట్లాడిన నాద‌ల్ ఆస్ట్రేలియా ఓపెన్ త‌న‌కు మిగ‌తా వాటి కంటే ఎక్కువ అని చెప్పాడు. సెమీఫైన‌ల్ విజ‌యాన్ని ఆస్వాదిస్తున్న‌ట్టు చెప్పిన నాద‌ల్.. ఫైన‌ల్‌లో గెల‌వ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పాడు.

ఒక్క‌సారే ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన నాద‌ల్

ఒక్క‌సారే ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన నాద‌ల్

కాగా త‌న కెరీర్‌లో నాద‌ల్ ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క సారి మాత్ర‌మే ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచాడు. 2009లో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్టామ్‌ను కైవ‌సం చేసుకున్నాడు. ఆ త‌ర్వాత 2012, 2017లో ఫైనల్ చేరిన‌ప్ప‌టికీ నొవాక్ జ‌కోవిచ్‌, రోజ‌ర్ ఫెద‌ర‌ర్ చేతిలో ఓడిపోయాడు. అలాగే ఆస్ట్రేలియ్ ఓపెన్‌లో నాద‌ల్ ఫైన‌ల్ చేర‌డం ఇది ఆరో సారి. కాగా గాయం కార‌ణంగా ఈ సారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫెద‌ర‌ర్ ఆడ‌లేదు. ఇక నొవాక్ జోకోవిచ్ విష‌యానికొస్తే వ్యాక్సినేష‌న్‌, వీసా వంటి స‌మ‌స్యల‌తో అత‌నికి టోర్నీలో పాల్గొనే అవ‌కాశం ద‌క్క‌లేదు.

Story first published: Friday, January 28, 2022, 16:05 [IST]
Other articles published on Jan 28, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X