Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రప్ఫాడించిన రఫెల్ నాదల్: యుఎస్ ఓపెన్‌లో అతికష్టం మీద సెమీఫైనల్‌కు

Rafael Nadal survives Dominic Thiem scare to enter US Open semis

హైదరాబాద్: న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యుఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టైటిల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన నాదల్ అతికష్టం మీద సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి రెండు రౌండ్లలో సులువుగా విజయాలు సాధించిన నాదల్ మూడో రౌండ్ నుంచి ప్రతీ మ్యాచ్‌లోనూ విజయం కోసం గట్టి పోటీని ఎదుర్కొన్నాడు.

డొమినిక్ థీమ్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోరు ఆరంభం నుంచే నాదల్ తడబడ్డాడు. నాదల్‌కు 9వ సీడ్ థీమ్ గట్టి పోటీనిచ్చాడు. క్వార్టర్స్‌లో తొలి సెట్‌లో డొమినిక్ థీమ్ అంచనాలకు మించి రాణించాడు. 6-0తో తొలి సెట్‌ నెగ్గి నాదల్‌కు గట్టి షాకిచ్చాడు. ఇక, రెండో సెట్‌లో అనూహ్యంగా పుంజుకున్న నాదల్ విజృంభించాడు.

తన అనుభవాన్ని ఉపయోగించి రాణించిన నాదల్ వరుసగా రెండు సెట్లను 6-4, 7-5తో సొంతం చేసుకున్నాడు. ఇక, నాలుగో సెట్‌లోనూ నాదల్ తన జోరుని కొనసాగించాడు. ఈ సెట్‌లో డొమినిక్ గట్టి పోటీనివ్వడంతో మ్యాచ్ టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేకర్‌లో నాదల్‌పై ఆధిపత్యం ప్రదర్శించి 7-4 పాయింట్లతో టై బ్రేక్‌లో నాలుగో సెట్ నెగ్గాడు.

దీంతో నిర్ణయాత్మక 5వ సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడటంతో మరో సారి టై బ్రేక్‌కు దారి తీసింది. టై బ్రేక్‌లో నాదల్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ఆడి మ్యాచ్‌లో విజయం సాధించాడు.

2017 యుఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచిన నాదల్, మూడు సార్లు యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సెమీస్‌లో కూడా ఇదే జోరుని కొనసాగించి ఫైనల్‌కు అర్హత సాధిస్తే నాలుగోసారి నాదల్ యుఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ఖాయం.

ప్రస్తుతం ఏటీపి వరల్డ్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉన్న నాదల్ ఈ టైటిల్ నెగ్గితే 18 సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరిస్తాడు. ఇదే జరిగితే ఫెదరర్ తర్వాత మోడ్రన్ టెన్నిస్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ అందుకున్న ఆటగాడిగా అరుదైన ఘనత సాధిస్తాడు.

Story first published: Wednesday, September 5, 2018, 13:53 [IST]
Other articles published on Sep 5, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+