Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బార్సిలోనా ఓపెన్‌లో నాదల్‌కు షాక్...

Rafael Nadal shock at the Barcelona Open as he loses 6-4 6-4 to Dominic Thiem

టెన్నిస్ స్టార్ ఆటగాడు, స్పెయిన్ బుల్ రాఫెల్‌ నాదల్‌కు షాక్ తగిలింది. క్లే కోర్టుల్లో వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొన్నాడు. బార్సిలోనా ఓపెన్‌ సెమీఫైనల్లో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో 6-4, 6-4తో నాదల్‌ పరాజయం పాలయ్యాడు. రెండు గంటల పాటు ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. థీమ్‌ సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

బార్సిలోనా టోర్నీ చరిత్రలో నాదల్‌ను ఓడించిన నాలుగో ప్లేయర్‌గా థీమ్‌ నిలిచాడు. ఇంతకుముందు కొరెత్యా (2003లో), అల్మాగ్రో (2014లో), ఫాగ్‌నిని (2015లో) నాదల్‌పై విజయం సాధించారు. 15 సార్లు బార్సిలోనా ఓపెన్‌లో బరిలోకి దిగిన నాదల్‌ 11సార్లు విజేతగా నిలిచాడు. తాజాగా మోంటెకార్లో ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ సెమీఫైనల్లో ఫాగ్‌నిని (ఇటలీ) చేతిలో నాదల్ ఓడిపోయాడు. దీంతో వారం వ్యవధిలో నాదల్‌ వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొన్నాడు.

Story first published: Sunday, April 28, 2019, 10:27 [IST]
Other articles published on Apr 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+