న్యూఢిల్లీ: స్పానిష్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్‌కు అపెండిక్స్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయినట్లు అతడి నిర్వహణ సంస్ధ తెలిపింది. "రఫా ఇప్పుడు బాగున్నాడు. ఆపరేషన్ కూడా చాలా బాగా జరిగింది. అంతా బాగుంటే ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావొచ్చు" అని బీ1పీఆర్ ట్విట్టర్ పేజ్ లో పోస్టు చేసింది.
ఇప్పటివరకు పద్నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్‌లు గెలుచుకున్న రఫెల్ నాదల్ సర్జరీ కోసం గత నెల స్విట్జర్లాండ్ ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగాడు. అప్పుడే తన ఆపరేషన్ గురించి అభిమానులకు తెలియజేశాడు.
ఆపరేషన్ ధియేటర్‌లోకి ప్రవేశించే ముందు చిన్న సర్జరీ అంటూ రఫెల్ నాదల్ తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.

సర్జరీ అనంతరం రఫెల్ నాదల్ సర్జరీ సునాయాసంగా జరిగిందన్నారు. మీ సపోర్టుకి కృతజ్ఞతలు తెలియజేశారు.
