Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ప్రపంచ నంబర్ వన్‌కు నాదల్ అన్ని విధాలా అర్హుడు'

Rafael Nadal sends Novak Djokovic message after Wimbledon success

హైదరాబాద్: ఇటీవల ముగిసిన వింబుల్డన్ టోర్నీలో ట్రోఫీ ఎగరేసుకుపోయన జకోవిచ్.. ఫైనల్‌లో తనకు గట్టి పోటీనిచ్చిన నాదల్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం పురుషుల టెన్నిస్‌లో రఫెల్‌ నాదలే అత్యుత్తమ ఆటగాడని, అతను నంబర్‌వన్‌ ర్యాంకులో కొనసాగడానికి అర్హుడని నొవాక్‌ జకోవిచ్‌ అన్నాడు. టైటిల్ గెలుచుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన జకోవిచ్‌ ..

'నాదల్‌తో మ్యాచ్‌లో నేను ఓటమి అంచుల దాకా వెళ్లాను. అతను అత్యుత్తమ ఆటగాడు. ప్రస్తుతం ప్రపంచ టెన్నిస్‌లో నంబర్‌వన్‌గా ఉండటానికి అర్హుడు. మట్టి కోర్టు సీజన్‌లో అతను తిరుగులేని ఆధిపత్యం చలాయించాడు' అన్నాడు. తాను ఇప్పుడు గెలిచిన వింబుల్డన్‌ టైటిల్‌ తన కెరీర్లోనే అత్యుత్తమ విజయాల్లో ఒకటని నొవాక్‌ అభిప్రాయపడ్డాడు. రెండేళ్లు ఎంతో కఠినంగా గడిచాయని.. మోచేతి గాయంతో పాటు అనేక ఇబ్బందికర పరిస్థితుల్ని తాను అధిగమించి ఈ టైటిల్‌ సాధించానని చెప్పాడు.

లండన్ వేదికగా ఆదివారం రాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌ పోరులో ప్రత్యర్థి, దక్షిణాఫ్రికా ఆటగాడు అండర్సన్‌పై 6-2, 6-2, 7-6తో విజయం సాధించాడు. కెరీర్‌లో జకోవిచ్‌కి ఇది నాలుగో వింబుల్డన్‌ టైటిల్‌కాగా.. మొత్తంగా ఇది 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ సెర్బియా స్టార్ చాలా రోజుల తర్వాత.. తన మునుపటి ఆటతీరుతో అభిమానుల్ని అలరించాడు. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌ టైటిల్‌ను మరోసారి సెర్బియా యోధుడు సొంతం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో జకోవిచ్‌ విజేతగా నిలిచాడు.

రెండేళ్లుగా గాయాలు, ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతూ వైఫల్యాలు చవిచూస్తున్న జకోవిచ్.. మళ్లీ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌తో జోరు అందుకున్నాడు. టైటిల్‌ను తన కొడుకుతో కలిసి అందుకున్న జకోవిచ్ భావోద్వేగానికి గురయ్యాడు. 'గత రెండేళ్లుగా చాలా కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొన్నాను. ఒక సర్జరీ చేయించుకుని.. దాదాపు ఆరు నెలలు ఆటకి దూరమయ్యా. దీంతో.. నా ఆటపై నాకే సందేహాలొచ్చాయి. అయితే.. మళ్లీ ఈ స్థాయి ప్రదర్శనని చేస్తానని ఊహించలేదు. మూడేళ్ల నా కొడుకు చూస్తుండగా.. ఈ టైటిల్‌ను గెలవడం చాలా సంతోషంగా ఉంది' అని జకోవిచ్ వెల్లడించాడు.

Story first published: Wednesday, July 18, 2018, 9:57 [IST]
Other articles published on Jul 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+