For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్: నాదల్ ఆట మొదలైంది

Rafael Nadal, Roger Federer earn top 2 seeds for Australian Open

హైదరాబాద్: కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్దమవుతున్నాడు. సోమవారం ఆరంభమవుతున్న ఈ ఏడాది మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్‌లో.. 51వ ర్యాంకు ఆటగాడు అల్జాజ్‌ బెడెన్‌ (స్లొవేనియా)తో మ్యాచ్‌తో అతడు టైటిల్‌ వేటను ఆరంభించనున్నాడు.

గురువారం తీసిన టోర్నీ పురుషుల సింగిల్స్‌ డ్రా ప్రకారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఫెదరర్‌కు క్వార్టర్‌ఫైనల్లో డేవిడ్‌ గొఫిన్‌ (బెల్జియం) ఎదురయ్యే అవకాశముంది. అంతకుముందు నాలుగో రౌండ్లో అతడికి భారీ సర్వ్‌లు చేసే రోనిచ్‌ (కెనడా) ఎదురుకావొచ్చు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్‌, టాప్‌ సీడ్‌ రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) తొలి రౌండ్లో 83వ ర్యాంకు ఆటగాడు విక్టర్‌ బుర్గోస్‌ (డొమినికన్‌ రిపబ్లిక్‌)ను ఢీకొంటాడు.

క్వార్టర్‌ఫైనల్లో అతడికి మారిన్‌ సిలిక్‌ (క్రొయేషియా) ఎదురయ్యే అవకాశముంది. ఆరు సార్లు ఛాంపియన్‌ నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా)కు కాస్త కఠిన డ్రానే ఎదురైంది. గాయం కారణంగా ఆరు నెలలపాటు ఆటకు దూరమైన అతడు ఈ టోర్నీలో 14వ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు.

తొలి రౌండ్లో అమెరికా యువ ఆటగాడు డొనాల్డ్‌ యంగ్‌ను ఎదుర్కొంటాడు. రెండో రౌండ్లో గేల్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) ఎదురుకావొచ్చు. ఇక మహిళల విభాగంలో ప్రపంచ టాప్‌ ర్యాంకర్‌ హలెప్‌కు టాప్‌ సీడ్‌ దక్కింది. ఆ తర్వాత వోజ్నియాకి, ముగురుజ, ఎలినా స్వితోలినా ఉన్నా రు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, January 12, 2018, 12:26 [IST]
Other articles published on Jan 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+