Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వింబుల్డన్: లండన్ వీధుల్లో సైకిల్‌పై రఫెల్ నాదల్ (వీడియో)

Rafael Nadal rides a bike to go grocery shopping. Watch video

హైదరాబాద్: స్పెయిన్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ రఫెల్ నాదల్ లండన్ వీధుల్లో సైకిల్‌పై చక్కర్లు కొట్టాడు. రఫెల్ నాదల్ ప్రస్తుతం వింబుల్డన్ టోర్నీలో ఆడుతోన్న సంగతి తెలిసిందే. అయితే, తన బిజీ షెడ్యూల్ నుంచి కాస్త సమయం తీసుకున్నాడు.

కిరాణా సామాను తెచ్చుకునేందుకు గాను లండన్‌లో సైకిల్‌ తొక్కుకుంటూ షాపుకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోని నాదల్ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. "ఎవరో ఒకరు వెళ్లి కిరాణా సామాను తేవాల్సిందే కదా" అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వింబుల్డన్‌ టోర్నీలో నాదల్ క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాడు. మంగళవారం చెక్ రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్ ప్లేయర్ జిరి వెస్లీతో అతడు క్వార్టర్స్‌లో తలపడనున్నాడు. ఇటీవలే పారిస్ వేదికగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌ను నాదల్ నెగ్గాడు.

దీంతో ఫ్రెంచ్ ఓపెన్‌ను అత్యధికంగా రికార్డు స్థాయిలో 11వ సార్లు నెగ్గి చరిత్ర సృష్టించిన నాదల్ వింబుల్డన్‌ ట్రోఫీని గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు.

Story first published: Monday, July 9, 2018, 18:38 [IST]
Other articles published on Jul 9, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+