For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్రెంచ్ ఓపెన్: 'మణికట్టు విరగడం వల్లే టోర్నీ నుంచి తప్పుకున్నా'

ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను పదోసారి కైవసం చేసుకునేందుకు గతేడాది బరిలోకి దిగినప్పటికీ, మణికట్టు విరగడంతో మూడో రౌండ్‌లోనే ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వాల్సి వచ్చిందని రఫెల్ నాదల్ అన్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను పదోసారి కైవసం చేసుకునేందుకు గతేడాది బరిలోకి దిగినప్పటికీ, మణికట్టు విరగడంతో మూడో రౌండ్‌లోనే ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వాల్సి వచ్చిందని రఫెల్ నాదల్ అన్నాడు. రొలాండ్ గారోస్‌ టైటిల్‌ను తొమ్మిదిసార్లు విజేతగా నిలిచిన నాదల్ గతేడాది అదే ఆశతోనే అడుగుపెట్టాడు.

మొదటి రౌండ్‌లో శామ్ గ్రాత్‌ను 6-1, 6-1, 6-1 తేడాతో చిత్తుగా ఓడించాడు. రెండో రౌండ్‌లో ఫాకండో బాగ్నిస్‌ను 6-0, 6-0, 6-3 తేడాతో ఓడించి, మార్సెల్ గ్రానొలెర్స్‌తో మూడో రౌండ్ మ్యాచ్‌ని ఖాయం చేసుకున్నాడు. అయితే, ఆ మ్యాచ్ ఆరంభానికి ముందే నాదల్ వైదొలగుతున్నట్టు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

 Rafael Nadal reveals he almost 'destroyed' wrist at French Open 2016

అయితే హఠాత్తుగా తన ప్రత్యర్థికి వాకోవర్ ఇవ్వడానికి బలమైన కారణమే ఉందని చెప్పాడు. రెండో రౌండ్ మ్యాచ్ ఆడుతూ కిందపడినప్పుడు తన చేతి మణికట్టు దాదాపుగా విరిగిందని చెప్పాడు. చివరి క్షణం వరకూ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఆడదామనే అనుకున్నానని, కానీ, తీవ్రమైన నొప్పి కారణంగా ఆడలేకపోయానని నాదల్ తెలిపాడు.

ప్రస్తుతం మణికట్టు గాయం పూర్తిగా తగ్గిందని, పూర్తి ఫిట్‌నెస్‌తో తాను ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగుతున్నానని చెప్పాడు. ఇదిలా ఉంటే ఆదివారం ఫ్రెంచ్ ఓపెన్ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన 'డ్రా'ను శుక్రవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రఫెల్‌ నాదల్‌ ఒకే పార్శ్వంలో ఉన్నారు.

ఫలితంగా ఈ ఇద్దరూ క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని దాటితే సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. ఈ టోర్నీ చరిత్రలో నాదల్‌ గెలుపోటముల రికార్డు 72-2గా ఉంది. గాయం కారణంగా గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ మధ్యలోనే నిష్క్రమించిన నాదల్‌ ఈసారి క్లే కోర్టు సీజన్‌లో మోంటెకార్లో మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్స్‌ గెలిచి నాదల్ జోరు మీదున్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+