Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్ ఓపెన్ ఎఫెక్ట్: డేవిస్‌ కప్‌కూ నాదల్ దూరం

Rafael Nadal out of Spains Davis Cup semi-final

హైదరాబాద్: గాయం కారణంగా యుఎస్ ఓపెన్ సెమీఫైనల్స్ మ్యాచ్ మధ్యలో తప్పుకున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తాజాగా డేవిస్ కప్ సెమీఫైనల్స్ నుంచీ తప్పుకుంటునట్లు ప్రకటించాడు. ఈ మేరకు స్పానిష్ టెన్నిస్ ఫెడరేషన్ ఒక అధికారిక ప్రకటన చేసింది.

వచ్చేవారం స్పెయిన్‌లో జరగనున్న డేవిస్ కప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్ ఆటగాడితోనే నాదల్ తలపడాల్సి ఉంది. అయితే, గత ఆదివారంతో ముగిసిన యుఎస్ ఓపెన్‌లో అర్జెంటీనా ఆటగాడు డెల్‌ పోట్రోతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో నాదల్‌ మోకాలి గాయం కారణంగా ఆటను కొనసాగించలేకపోయాడు.

ఆట మధ్యలో మోకాలి గాయంతో బాధపడ్డ నాదల్‌ తొలి రెండు సెట్లను కోల్పోయిన తర్వాత టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొలి సెట్‌ను 6-7(3/7) చేజార్చుకున్న నాదల్‌.. రెండో సెట్‌ను 2-6తో కోల్పోయాడు. ఆ తర్వాత నాదల్‌ మోకాలి గాయం మరింత ఇబ్బంది పెట్టడంతో టోర్నీ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు.

దీంతో, తాజాగా "డేవిస్ కప్ సెమీఫైనల్స్‌లో ఫ్రాన్స్‌తో నాదల్ తలపడే స్థితిలో లేడు. యుఎస్ ఓపెన్‌లో మోకాలి గాయం తిరగబెట్టడంతో, డేవిస్ కప్ సెమీఫైనల్స్ నుంచీ తప్పుకుంటున్నాడు" అని స్పెయిన్ జట్టు కెప్టెన్ సెర్జి బృగువేరా వెల్లడించాడు. "అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. డేవిస్ కప్‌లో స్పానిష్ జట్టుకు అతను అందించిన సహకారాన్ని మరువలేం" అని అన్నాడు.

Story first published: Tuesday, September 11, 2018, 18:52 [IST]
Other articles published on Sep 11, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+