Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామెంటేటర్ చెప్పిందని... నాదల్ vs బాల్‌బాయ్

Rafael Nadal Makes Ball Boys Day At Roland Garros

హైదరాబాద్: ఫ్రెంచ్‌ గ్రాండ్‌ స్లామ్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వరల్డ్‌ నంబర్‌ వన్‌ రఫెల్‌ నాదల్‌.. తన అభిమాని అయిన బాల్‌బాయ్‌తో కలిసి టెన్నిస్‌ ఆడి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. టెన్నిస్‌లో దిగ్విజయంగా కొనసాగుతోన్న నాదల్ రొలాండ్ గార్రోస్ స్టేడియం వేదికగా తన 32వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో భాగంగా మూడో రౌండ్ మ్యాచ్ ఆడి విజేతగా నిలిచాడు.

టెన్నిస్‌ను కెరీర్‌గా మలుచు

టెన్నిస్‌ను కెరీర్‌గా మలుచు

స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌‌ నాదల్‌‌ను స్ఫూర్తిగా తీసుకుని యువ ఆటగాళ్లు టెన్నిస్‌ను కెరీర్‌గా మలుచుకుంటున్నారు. తాము అంతగా ఆరాధించే ఆటగాడితో ఒక్కసారైనా కలిసి ఆడాలన్న కోరిక ఎవరికి మాత్రం ఉండదు. తాజాగా ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. ప్రస్తుతం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడుతోన్న నాదల్‌ మూడో రౌండ్లో విజయం సాధించి తర్వాతి రౌండ్‌కు దూసుకెళ్లాడు.

కోర్టులో ఆసక్తికరమైన సన్నివేశం

విజయం అనంతరం కోర్టులో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. మ్యాచ్‌ అనంతరం నాదల్‌ కామెంటేటర్‌తో మాట్లాడుతుండగా... ఓ బాల్‌ బాయ్‌ నాదల్‌లో ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ‘ప్రపంచ వ్యాప్తంగా నీకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఈ బాల్‌ బాయ్‌ కూడా నీకు వీరాభిమానే. నీతో కలిసి ఒక్క బాల్‌ అయినా ఆడాలన్నది అతడి కల' అని ఆ కామెంటేటర్‌ అడిగారు.

నవ్వుతూ ఆ బాల్‌ బాయ్‌తో ఆడేందుకు సరే

నవ్వుతూ ఆ బాల్‌ బాయ్‌తో ఆడేందుకు సరే

నాదల్‌ నవ్వుతూ ఆ బాల్‌ బాయ్‌తో ఆడేందుకు సరే అన్నాడు. అంతేకాదు తాను ఆడే బ్యాట్‌ను బాల్‌ బాయ్‌కి ఇచ్చి ఆడమన్నాడు. తన అభిమాన ప్లేయర్‌తో అతనికెంతో ఇష్టమైన క్లే కోర్టుపై ఆడే అవకాశం రావడంతో ఆ బాల్‌బాయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇద్దరూ కలిసి ఆడుతుంటే ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. నాదల్‌తో ఆడే ముందు ఆ బాల్‌ బాయ్‌ కాస్త ఇబ్బంది పడ్డాడు.

పక్కా ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగే ఆడా..

పక్కా ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగే ఆడా..

ఓ పక్కా ప్రొఫెషనల్ ప్లేయర్‌లాగే ఆడాడు. ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘బాల్‌ బాయ్‌ కల నెరవేరింది, నాదల్ మంచి మనసున్నవాడు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Story first published: Monday, June 4, 2018, 15:36 [IST]
Other articles published on Jun 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+