Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యుఎస్ ఓపెన్: నాదల్‌ను రఫాడించిన ఫోగ్ని

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో రఫెల్ నాదల్ ఓటమి చెందాడు. 8వ సీడ్ ప్లేయర్ అయిన నాదల్ మూడోరౌండ్‌లోనే ఇటలీకి చెందిన 32వ సీడ్ ప్లేయర్ ఫాబియో ఫోగ్ని చేతిలో ఓటమి పాలైయ్యాడు. ఫోగ్ని నాదెల్‌పై 3-6, 4-6, 6-4, 6-3, 6-4 పాయింట్ల తేడాతో గెలుపొందాడు.

ఫోగ్నిపై నాదల్ తొలి రెండు సెట్లు గెలిచాడు. వెనకబడి పోయిన స్థితిలో తేరుకుని 32వ సీడ్ ఫోగ్నీపై మూడో సెట్‌లో కూడా విజయం సాధించాడు. అయితే, నిర్ణయాత్మకమైన ఐదో సెట్‌లో ఇద్దరు కూడా హోరాహోరీగా పోరాడారు. అయితే ఫోగ్నీ దూకుడుకు రఫెల్ నాదల్ తలొంచాల్సి వచ్చింది.

Rafael Nadal knocked out of US Open by Fabio Fognin

రెండుసార్లు యుఎస్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్న రఫెల్ నాదల్ గత పదేళ్ల కాలంలో ఇంత త్వరగా ఓ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి ఇంటి దారి పట్టడం ఇదే తొలిసారి. 2005 తర్వాత యుఎస్ ఓపెన్‌లో ఓ ఇటలీ ఆటగాడు ప్రీ క్వార్టర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.

ఫోగ్ని తదుపరి మ్యాచ్‌లో స్పెయిన్ క్రీడాకారుడు ఫిలిసియానో లోపెజ్‌తో తలపడనున్నాడు. సైమోన్ బోలెల్లీతో కలిసి ఈ ఏడాది ఫోగ్ని ఓపెన్ పురుషుల విభాగంలో టైటిల్ కైవసం చేసుకున్నాడు. నాదల్‌పై పోరు అత్యంత కష్టమైన పని అని ఫోగ్ని అన్నాడు. ఇది అద్భుతమైన మ్యాచ్ అని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:15 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+