
హైదరాబాద్: మాజీ వరల్డ్ నెంబర్ వన్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన స్నేహితురాలు మేరీ పెరెల్లోను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరూ నిశ్చితార్ధం చేసుకున్నారు. వచ్చే వేసవిలో నాదల్ వివాహం చేసుకోనున్నట్లు స్పెయిన్‌కు చెందిన హోలా మేగజైన్ కథనాన్ని ప్రచురించింది.
గత 14 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతుండగా... గతేడాది మే నెలలో ఫ్రాన్సెస్కాకు నాదల్ పెళ్లి ప్రతిపాదన చేశాడు. ఏటీపీ టెన్నిస్ ఈవెంట్లు ముగిసిన తర్వాత, బహుశా అక్టోబర్ లేదా నవంబర్‌లో నాదల్ వెడ్డింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. నాదల్ అకాడమీలోనే పెరెల్లో పనిచేస్తుండటం విశేషం.
ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను తన ఖాతాలో వేసుకున్న నాదల్ మొత్తం 17 గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్నాడు.