For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ రికార్డు నెలకొల్పిన నాదల్‌కు షాక్: నంబర్‌వన్‌ ర్యాంక్‌‌కు ఎసరు

By Nageshwara Rao
Rafael Nadal drops initial compare on clay in a year with detriment to Dominic Thiem during Madrid Open

హైదరాబాద్: ప్రపంచ రికార్డు నెలకొల్పి 24 గంటలు కూడా గడవక ముందే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్‌ ఓడిపోయాడు. మాడ్రిడ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌‌గా బరిలోకి దిగిన రఫెల్ నాదల్ క్వార్టర్‌ ఫైనల్‌లోనే నిష్క్రమించాడు.

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌(ఆస్ట్రియా) 7-5, 6-3తేడాతో వరల్డ్ నంబర్‌వన్‌ రఫెల్ నాదల్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లాడు. ఈ ఓటమితో నాదల్ 21 వరుస విజయాలకు తెరపడింది.

 నాదల్ నెగ్గిన డొమినిక్‌ థీమ్‌

నాదల్ నెగ్గిన డొమినిక్‌ థీమ్‌

అంతేకాదు సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌పై కూడా దీని ప్రభావం చూపనుంది. నాదల్‌తో గతంలో ఎనిమిదిసార్లు ఆడి రెండు సార్లే నెగ్గిన థీమ్‌ ఈసారి విజయాన్ని సాధించాడు. గంటా 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో థీమ్‌ నాదల్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు.

మెకన్రో రికార్డు బద్దలు కొట్టిన రఫెల్ నాదల్

మెకన్రో రికార్డు బద్దలు కొట్టిన రఫెల్ నాదల్

రఫెల్ నాదల్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. క్లే కోర్టులో వరుసగా 50 సెట్లు గెలుచుకున్న ఆటగాడిగా 34 ఏళ్ల కిందట అమెరికా టెన్నిస్‌స్టార్ జాన్ మెకన్రో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. గతంలో మెకన్రో వరుసగా క్లే కోర్టులో 49 సెట్లు గెలుచుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మాడ్రిడ్ ఓపెన్‌లో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 6-3, 6-4తో డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)పై గెలుపొందాడు.

50 సెట్‌లు గెలిచిన ఏకైక ప్లేయర్‌

50 సెట్‌లు గెలిచిన ఏకైక ప్లేయర్‌

దీంతో క్లే కోర్టులపై వరుసగా 50 సెట్‌లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు జాన్‌ మెకన్రో (అమెరికా) పేరిట ఉండేది. మెకన్రో 1984లో క్లే కోర్టులపై వరుసగా 49 సెట్‌లు గెలిచాడు.

 హలెప్‌ ఓటమి

హలెప్‌ ఓటమి

మరోవైపు ఇదే వేదికపై జరుగుతున్న మహిళల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా) పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6-3, 6-4తో హలెప్‌ను బోల్తా కొట్టించింది. దాంతో వరుసగా మూడోసారి ఈ టైటిల్‌ సాధించాలని ఆశించిన హలెప్‌కు నిరాశ ఎదురైంది.

Story first published: Saturday, May 12, 2018, 11:33 [IST]
Other articles published on May 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+