For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rafael Nadal : ఆల్ టైం టెన్నిస్ అత్యుత్తమ క్రీడాకారులలో ఆమె ఒకరు..!

Rafael Nadal Congratulate Serena Williams and Says She is One Of the All Time Great

అత్యుత్తమ వుమెన్స్ టెన్నిస్ క్రీడాకారిణులలో ఒకరైన సెరెనా విలియమ్స్.. యూఎస్ ఓపెన్ తర్వాత వీడ్కోలు పలకబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె తన కెరీర్లో రికార్డు స్థాయిలో 23గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకుంది. ఆమె రిటైర్మెంట్ ప్రకటన వెలువడినప్పటి నుండి టెన్నిస్ ప్రముఖులు, ఇతర వర్గాల నుంచి ఆమె టెన్నిస్ కెరీర్ అనంతర జీవితానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇన్నాళ్లు టెన్నిస్ క్రీడలో ఆమె సాధించిన విజయాలను గుర్తు చేస్తూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా టెన్నిస్ గ్రేట్ రాఫెల్ నాదల్ సైతం సెరెనాకు హృదయపూర్వక శుభాభినందనలు తెలిపాడు. ఆమె ఓ "అద్భుతమైన ప్రేరణ" అని, "ఆల్ టైం గొప్ప క్రీడాకారులలో ఆమె ఒకరు" అని ప్రశంసించాడు.

ఇకపోతే తన కెరీర్ చివరి అంకానికి చేరుకున్న సెరెనా 2022లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో 2 ఓడిపోయింది. ఇక సిన్సినాటి మాస్టర్స్‌లో ఎమ్మా రాడుకానుతో ఆమె తలపడనుంది. యూఎస్ ఓపెన్‌కు ముందు ఆమె చివరి WTA 1000 ప్రదర్శన ఇదే కావడం విశేషం. ఇక రఫా సెరెనా గురించి తలచుకుంటూ.. ఆమెకు సంబంధించి చాలా జ్ఞాపకాలున్నాయి. ఆమె ఎప్పటికీ గొప్ప క్రీడాకారుల్లో ఒకరు. ఆమెతో సుదీర్ఘకాలంగా టెన్నిస్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నాను.' అని పేర్కొన్నాడు.

ఇక టెన్నిస్ ఆటకు సెరెనా అందించిన గొప్ప సేవలను నాదల్ గుర్తు చేసుకుంటూ.. 'వాస్తవానికి.. టెన్నిస్ నుండి ఆమె నిష్క్రమించడం బాధాకరం కానీ.. ఆమె చేసిన టెన్నిస్ క్రీడలో నెలకొల్పిన అన్ని అచీవ్ మెంట్లను గుర్తు చేసుకుంటుంటే ఆమెకు అభినందనలు చెప్పకుండా ఉండలేకపోతున్నా. టెన్నిస్ క్రీడకు ఓ క్రేజు తీసుకొచ్చిన వాళ్లలో సెరెనా ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు' అని నాదల్ చెప్పాడు. ఆమె ఎవల్యూషన్ కోసం ఆమెకు శుభాకాంక్షలు తెలిపాడు. 'ఆమె ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి అద్భుతమైన ప్రేరణ అని నేను భావిస్తున్నాను. ఆమె తన జీవితంలోని ఈ దశలో తన కోసం ఎంచుకున్న మంచి పనులు సజావుగా సాగాలని కోరుకుంటున్నాను' అని చెప్పాడు.

Story first published: Monday, August 15, 2022, 18:43 [IST]
Other articles published on Aug 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+