Rafael Nadal: స్పెయిన్ ఓటమి.. ముగిసిన రఫెల్ నాదల్ కెరీర్
టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడేశాడు. డేవిస్ కప్‌లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓటమిపాలవ్వడంతో రఫెల్ నాదల్ కెరీర్ ముగిసింది. డేవిస్ కప్‌లో ఓటమితో సుదీర్ఘ కెరీర్‌ను ఆరంభించిన నాదల్ పరాజయంతోనే తన కెరీర్‌ను ముగించాడు. డేవిస్ కప్‌తో ఆటకు వీడ్కోలు పలుకుతానని నాదల్ అక్టోబర్‌లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్‌లో అద్వితీయ విజయాలతో ఈ దిగ్గజం తన పేరిట చరిత్ర లిఖించుకున్నాడు.
ఒకప్పటి ఫిట్‌నెస్, ఫామ్ లేని 38 ఏళ్ల ఈ స్పెయిన్ దిగ్గజం తొలి సింగిల్స్‌లో మ్యాచ్‌లో ఓటమి పాలయ్యాడు. బొటిక్ వాన్‌డి జాండ్‌షల్ప్ (నెదర్లాండ్స్) చేతిలో 4-6, 4-6తో చేతిలో పోరాడి పరాజయాన్ని చవిచూశాడు. అయితే మిగిలిన స్పెయిన్ ప్లేయర్ల పోరాటంతో నాదల్ ఆటను మరోసారి చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. కార్లోస్ అల్కారజ్ విజయం సాధించినప్పటికీ నిర్ణయాత్మ పోరులో అల్కారజ్, మార్సెల్ గ్రానోల్లర్స్ ద్వయం ఓటమిపాలవ్వడంతో డేవిస్ కప్‌లో స్పెయిన్ పోరాటం ముగిసింది. ఈ క్రమంలో రఫెల్ కెరీర్ కూడా ముగింపు పలికింది.

గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడింట పాల్గొనలేదు. డేవిస్ కప్‌కు ముందు చివరగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన నాదల్ నిరాశపరిచాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సెర్బియా స్టార్ జొకోవిచ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఓవరాల్‌గా రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్ టైటిళ్లు సాధించాడు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో ఛాంపియన్‌గా నిలిచాడు.
కాగా, డేవిస్ కప్‌లో సింగిల్స్‌లో ఓటమి అనంతరం రఫెల్ నాదల్ భావోద్వేగంతో మాట్లాడాడు. "ఇదే నా చివరి మ్యాచ్ అయితే ఒకరీతిలో మంచిదే. డేవిస్ కప్‌లో నా మొదటి మ్యాచ్‌లో నేను ఓడిపోయాను, అలాగే నా చివరి మ్యాచ్‌లో ఓడిపోయినట్లుగా అవుతుంది. ఓ సర్కిల్ ముగుస్తుంది'' అని రఫెల్ నాదల్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications