
హైదరాబాద్: ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో డొమినిక్ థీమ్‌పై 6-3, 5-7, 6-1, 6-1 నాదల్ విజయం సాధించారు. ఫలితంగా 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో నాదల్ కెరీర్‌లో 18 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు వచ్చి చేరాయి.
ఫ్రెంచ్ ఓపెన్‌ను 12 సార్లు గెలిచిన ఏకైక టెన్నిస్ ప్లేయర్‌గా రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించాడు. ఫెదరర్ అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌ల రికార్డ్‌కు మరో రెండు గ్రాండ్‌శ్లామ్‌ల దూరంలో నాదల్ నిలిచాడు. కాగా, టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన నాదల్‌కు థీమ్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయాడు.
తొలి సెట్లో గట్టి పోటీనిచ్చిన డొమినిక్ థీమ్... రెండో సెట్‌ను గెలుచుకుని నాదల్‌కు గట్టి షాకిచ్చాడు. అయితే, మూడు, నాలుగు సెట్లను గెలుచుకున్న రఫెల్ నాదల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.