Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాడ్రిడ్‌ ఓపెన్‌: నాదల్‌కు సిట్సిపాస్‌ షాక్‌

Rafael Nadal beaten by Stefanos Tsitsipas in Madrid Open semi-final

క్లే కోర్టు స్టార్, స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌కు షాక్‌ తగిలింది. మాడ్రిడ్‌ ఓపెన్‌ సెమీఫైనల్లోనే నాదల్‌ నిష్క్రమించాడు. గ్రీకు యువ ఆటగాడు సిట్సిపాస్‌ నాదల్‌కు ఊహించని షాక్ ఇచ్చాడు. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో నాదల్‌ 4-6, 6-2, 3-6తో సిట్సిపాస్‌ చేతిలో ఓటమిని ఎదుర్కొన్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌కు ముందు ఇది నాదల్‌కు షాకే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

తొలి సెట్లో ఓడిన నాదల్‌.. రెండో సెట్లో పుంజుకుని రేసులోకి వచ్చాడు. ఇక కీలక మూడో సెట్లో తడబడి.. సర్వీసు చేజార్చుకుని ఓటమి పాలయ్యాడు. తాజా విజయంతో సిట్సిపాస్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. ఏటీపీ టోర్నీ ఫైనల్‌ చేరడం ఈ సీజన్లో సిట్సిపాస్‌కు ఇది నాలుగోసారి. ఫైనల్లో సెర్బియా స్టార్ నొవాక్‌ జకోవిచ్‌తో సిట్సిపాస్‌ తలపడనున్నాడు.

మరో సెమీఫైనల్లో నొవాక్‌ జకోవిచ్‌ 7-6 (7-2), 7-6 (7-4)తో డొమినిక్‌ థీమ్‌ (కెనడా)పై గెలుపొందాడు. దీంతో జకోవిచ్‌ ఫైనల్ చేరుకున్నాడు. క్వార్టర్స్‌లో థీమ్‌ స్విస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు షాకిచ్చిన సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ ఫెదరర్‌ 6-3, 6-7 (11/13), 4-6తో ఐదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) చేతిలో ఓటమిపాలయ్యాడు.

Story first published: Monday, May 13, 2019, 9:14 [IST]
Other articles published on May 13, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+