Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rafael Nadal: రిటైర్మెంట్ ప్రకటించిన రఫెల్ నాదల్

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన కెరీర్‌ ఆడిన నాదల్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ స్పెయిన్ దిగ్గజం వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్‌లో చివరిసారిగా బరిలోకి దిగి ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించాడు.

సోషల్ మీడియాలో వీడియో‌ను పోస్ట్ చేసి రఫెల్ నాదల్ ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ''మీతో ఓ విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. ప్రోఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. గత కొన్నాళ్లు.. ముఖ్యంగా గత రెండేళ్లు కష్టతరంగా సాగాయి. నేను పరిమితులు లేకుండా ఆడానని నేను అనుకోవట్లేదు'' అని రఫెల్ నాదల్ భావోద్వేగంతో పేర్కొన్నాడు.

Rafael Nadal Announces Retirement 22-Time Grand Slam Champion to End Career at Davis Cup Finals

గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్‌ ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో మూడింట పాల్గొనలేదు. చివరగా ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన నాదల్‌ నిరాశపరిచాడు. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సెర్బియా స్టార్‌ జొకోవిచ్‌ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. కాగా, ఓవరాల్‌గా రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్ టైటిళ్లు సాధించాడు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో ఛాంపియన్‌గా నిలిచాడు.

అంతేగాక రఫెల్ నాదల్ 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. స్పెయిన్ తరఫున అనేక డేవిస్ కప్ విజయాలు, 90 ఏటీపీ టైటిళ్లు గెలిచాడు. బిగ్ త్రీలో..రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌లపై నాదల్ అద్భుత పోరాటంతో అపూర్వ విజయాలు సాధించాడు.

Story first published: Thursday, October 10, 2024, 16:09 [IST]
Other articles published on Oct 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+