Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

US Open 2019: ఫైనల్‌కు చేరిన రఫెల్ నాదల్

Rafael Nadal Advances To US Open Final Against Daniil Medvedev

హైదరాబాద్: యుఎస్ ఓపెన్‌లో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తన జోరుని కొనసాగిస్తున్నాడు. అందరూ ఊహించినట్లుగానే యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీ ఫైనల్లో రెండో సీడ్ రఫెల్ నాదల్‌ 7-6(8/6), 6-4, 6-1 తేడాతో బెర్రెట్టినీ(ఇటలీ)ని ఓడించాడు.

ఇప్పటికే 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను

ఇప్పటికే 18 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లను గెలిచిన రఫెల్ నాదల్‌ మరో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఇరువురి మధ్య తొలి సెట్‌ రసవత్తరంగా సాగింది. ఇద్దరు సమంగా నిలవడంతో టైబ్రేక్‌కు దారి తీసింది. టైబ్రేక్‌‌లో నాదల్ తన అనుభవాన్ని ఉపయోగించి బెర్రెట్టినీపై పైచేయి సాధించి తొలి సెట్‌ను కైవసం చేసుకున్నాడు.

తొలి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో

తొలి సెట్‌ను గెలిచిన ఆత్మవిశ్వాసంతో రెండు, మూడు సెట్లలో అదే జోరుని నాదల్‌ కొనసాగించాడు. ఈ క్రమంలో రెండో సెట్‌ను నాదల్‌ 6-4తో గెలవగా, మూడో సెట్‌ను 6-1తో దక్కించుకోవడంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇప్పటివరకు యుఎస్ ఓపెన్‌ను మూడు సార్లు గెలిచిన నాదల్ తాజాగా నాలుగో టైటిల్‌పై కన్నేశాడు.

మరో సెమీస్‌లో మెద్వెదెవ్‌ విజయం

ఇప్పటికే రోజర్‌ ఫెదరర్‌, నొవాక్‌ జొకోవిచ్‌లు ఇంటి ముఖం పట్టడంతో నాదల్‌ అలవోకగా టైటిల్‌ను గెలవొచ్చని టెన్నిస్ అభిమానులు అంటున్నారు. మరో సెమీస్‌లో దిమిత్రోవ్‌పై 7-6 (7-5), 6-4, 6-3 తేడాతో మెద్వెదెవ్‌ విజయం సాధించాడు. దీంతో 14 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన రష్యన్‌ ఆటగాడిగా మెద్వెదెవ్‌ రికార్డు నెలకొల్పాడు.

ఫైనల్లో మెద్వెదెవ్‌ vs నాదల్

ఆదివారం జరగనున్న ఫైనల్లో ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌తో నాదల్‌ తలపడనున్నాడు. నాదల్‌కు కెరీర్‌లో ఇది 27వ ఫైనల్ కాగా మెద్వెదెవ్‌కు తొలి ఫైనల్ కావడం విశేషం.

Story first published: Saturday, September 7, 2019, 11:18 [IST]
Other articles published on Sep 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+