Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Rafael Nadal: రఫెల్ నాదల్ నికర ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన కెరీర్‌‌ను కొనసాగించి నాదల్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల ఈ స్పెయిన్ దిగ్గజం వచ్చే నెలలో జరిగే డేవిస్ కప్‌లో చివరిసారిగా బరిలోకి దిగి ఆటకు గుడ్‌బై చెప్పనున్నాడు. సోషల్ మీడియాలో వీడియో‌ను పోస్ట్ చేసి ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు.

''మీతో ఓ విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను. ప్రోఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. గత కొన్నాళ్లు.. ముఖ్యంగా గత రెండేళ్లు కష్టతరంగా సాగాయి. నేను పరిమితులు లేకుండా ఆడానని నేను అనుకోవట్లేదు. జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం, ముగింపు ఉంటుంది'' అని రఫెల్ నాదల్ భావోద్వేగంతో పేర్కొన్నాడు.

Rafa Nadal Net Worth How Wealthy is the King of Clay After Retirement

అయితే ఈ క్రమంలో రఫెల్ నాదల్ గురించి నెట్టింట్లో అభిమానులు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. నాదల్ సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిళ్ల గురించి, అతని నికర ఆస్తుల విలువల గురించి ఎక్కువగా శోధిస్తున్నారు. కాగా, ఈ కింగ్ క్లే నికర ఆస్తుల విలువ 225 మిలియన్ల అమెరికన్ డాలర్లు. భారత కెరెన్సీలో సుమారు రూ. 18,892,676,250 కోట్లు. ఈ రూ.1889 వేల కోట్లలో దాదాపు రూ.1133 వేల కోట్లు ప్రైజ్‌మనీ ద్వారానే రఫెల్ నాదల్ సంపాదించాడు.

ఫోర్బ్స్ ప్రకారం 2024లో అత్యధిక ఆదాయం అర్జించే క్రీడాకారులలో రఫెల్ నాదల్ కూడా ఒక్కరు. అతను 23.3 మిలియన్ల డాలర్లు సంపాదించాడు. ఇక ఆటతో పాటు ప్రముఖ బ్రాండ్‌ల ఒప్పందాలతోనూ పెద్దఎత్తున సంపాదిస్తున్నాడు. నైక్, బాబోలాట్, కియా, టామీ హిల్‌ఫిగర్, అమ్‌స్టెల్ వంటి బ్రాండ్‌లతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. మల్లోర్కాలో అతను నివాసం ఉండే ఇంటిని 2003లో 4 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేశాడు.

కాగా, 'క్లే కోర్టు' రారాజుగా వెలుగొందిన నాదల్ 1986 జూన్ 3న స్పెయిన్‌లో జన్మించాడు. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లోకి ప్రవేశించాడు. ఓవరాల్‌గా రఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లామ్స్ టైటిళ్లు సాధించాడు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్, రెండు సార్లు వింబుల్డన్, నాలుగు సార్లు యూఎస్ ఓపెన్, రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లలో ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేగాక రఫెల్ నాదల్ 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాడు. స్పెయిన్ తరఫున అనేక డేవిస్ కప్ విజయాలు, 92 ఏటీపీ టైటిళ్లు గెలిచాడు. బిగ్ త్రీలో..రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌లపై నాదల్ అద్భుత పోరాటంతో అపూర్వ విజయాలు సాధించాడు.

Story first published: Thursday, October 10, 2024, 17:15 [IST]
Other articles published on Oct 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+