Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాదల్ వల్లే నెంబర్ వన్ ర్యాంకులో: రోజర్ ఫెదరర్ ఉద్వేగం (వీడియో)

Rafa Nadal is the Reason I'm a Better Player: Roger Federer

హైదరాబాద్: ఆటగాడిగా తన ఎదుగుదలలో స్పెయిన్ బుల్ రఫెల్‌ నాదల్‌ పాత్ర ఉందని స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ పేర్కొన్నాడు. మొనాకో వేదికగా బుధవారం లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో 2017 సంవత్సరానికి 'స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌'.. 'కమ్‌బ్యాక్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డులను ఫెదరర్ గెలుచుకున్నాడు.

అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ నాదల్‌ లాంటి బలమైన ఆటగాడితో ఎక్కువసార్లు తలపడటం వల్ల తన ఆట మెరుగైందని చెప్పాడు. 'నా ప్రత్యర్థి రఫాకు ధన్యవాదాలు. మా మధ్య గొప్ప పోరాటాలు జరిగాయి. అలాంటి ఆటగాడు ప్రత్యర్థి కావడం వల్ల నేను మెరుగైన ఆటగాడిగా ఎదిగాను. అతనొక అపురూపమైన ఆటగాడు, స్నేహితుడు, అథ్లెట్‌' అని అన్నాడు.

మాజీ టెన్నిస్‌ దిగ్గజం బోరిస్‌ బెకర్‌ చేతుల మీదుగా ఫెదరర్ ఈ పురస్కారాలను అందుకున్నాడు. 'స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' పురస్కారం రేసులో క్రిస్టియానో రొనాల్డో (పుట్‌బాల్‌), మో ఫరా (అథ్లెటిక్స్‌), లూయిస్‌ హామిల్టన్‌ (ఫార్ములావన్‌), రాఫెల్‌ నాదల్‌ (టెన్నిస్‌) కూడా ఉన్నప్పటికీ ఫెదరర్‌నే ఈ అవార్డు వరించింది.

36 ఏళ్ల వయసులో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అయి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. 2017లో రెండు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో పాటు ఏడు ట్రోఫీలను గెలిచాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను నెగ్గిన రోజర్ ఫెదరర్ తాజాగా రోటర్‌డామ్‌ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని ఆరేళ్ల తర్వాత మళ్లీ వరల్డ్ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు.

కెరీర్‌ తొలినాళ్లలోనే 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు లారెస్‌ 'స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ద ఇయర్‌' అవార్డును అందుకున్నాడు. తాజాగా అతని ఖాతాలో మరో రెండు చేరడంతో మొత్తం ఆరు పురస్కారాలతో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.

అవార్డులు అందుకున్న అనంతరం ఫెదరర్ మాట్లాడుతూ 'ప్రతిష్టాత్మక అవార్డును మళ్లీ అందుకోవడం ఆనందంగా ఉంది. పునరాగమంలో ఈ స్థాయికి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. గతేడాది నాకెంతో కలిసొచ్చింది. నా కలల్ని సాకారం చేసుకునేందుకు సహకరించింది. నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న క్లిష్టమైన ప్రత్యర్థి రాఫెల్‌ నాదలే. అతనో అద్భుతమైన ఆటగాడు' అని అన్నాడు.

Story first published: Thursday, March 1, 2018, 10:48 [IST]
Other articles published on Mar 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+