For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖతార్ ఓపెన్: ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ సాధించిన బోపన్న జోడీ

Qatar Open: Bopanna, Koolhof win doubles title

హైదరాబాద్: భారత టెన్నిస్‌ డబుల్స్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ సాధించాడు. దోహా వేదికగా జరిగిన ఖతార్‌ ఓపెన్‌ ఏటీపీ టోర్నమెంట్‌లో నెదర్లాండ్స్‌ ఆటగాడు వెస్లీ కూలాఫ్‌తో కలిసి బోపన్న కతార్‌ ఓపెన్‌లో డబుల్స్‌ చాంపియన్‌గా నిలిచాడు.

శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో మూడోసీడ్‌ బోపన్న-వెస్లీ జోడీ 3-6, 6-2, 10-6తో ల్యూక్‌ బాంబ్రిడ్జ్‌ (బ్రిటన్‌)-శాంటియాగో గోంజాలెజ్‌ (మెక్సికో) జోడీని ఓడించింది. విజేతగా నిలిచిన బోపన్న జోడీకి 76,870 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ.54 లక్షల 50 వేలు)తోపాటు 250 ఏటీపీ ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

శుక్రవారం జరిగిన మరో సెమీఫైనల్లో బోపన్న-కూలాఫ్‌ జంట 7-5, 6-2తో రెండో సీడ్‌ హెన్రీ కొంటినెన్‌ (ఫిన్‌లాండ్‌)-స్కుగోర్‌ (క్రొయేషియా) జోడీపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. 39 ఏళ్ల రోహన్‌ బోపన్నకు కెరీర్‌లో ఇది 19వ డబుల్స్‌ టైటిల్‌ కావడం విశేషం.

Story first published: Saturday, January 11, 2020, 8:32 [IST]
Other articles published on Jan 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+