
నితిన్ స్నేహితుడు కావడంతో పాటు తెలంగాణ హీరోగా ముద్ర పడటంతో గుండె జారి గల్లయింతయ్యిందే సినిమాకు జ్వాలా అంగీకరించిందని అంటారు. తానును చేయడానికి ఇష్టపడలేదు. కానీ నితిన్ వచ్చి వేడుకున్నాడని ఆ మధ్య జ్వాలా గుత్తా చెప్పింది. నితిన్ బతిలాడితే చేశానని ఆమె చెప్పదలుచుకుందన్న మాట. దాంతో తన సినిమాకు పెద్ద ప్రమోషన్ వస్తుందని చెప్పింది.
నటన మాటెలా ఉన్నా, స్టెప్పుల సంగతి అలా ఉంచితే, ఆమె స్టిల్స్ మాత్రం ప్రేక్షకులను కైపెక్కిస్తున్నాయి. దాంతో ముగ్గురు నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు వినికిడి. తమ చిత్రాల్లో ఐటం గాళ్‌గా నటించాలని అడిగారట. దీంతో షాకయిన గుత్తాజ్వాల తనను అందరూ ఇలా చూస్తున్నారేంటబ్బా అని ఆలోచనలో పడిందట. అందుకనే ఇప్పట్లో అస్సలు నటించే ఉద్దేశం లేదనీ తేల్చి చెప్పిందట.
గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో ఆమె ప్రేక్షకులను ఏ మేరకు ఊపేస్తుందనే విషయం తేలే రోజు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఆమెకు మరిన్ని ఆఫర్లు రావచ్చు. కానీ, పాపం.. ఐటం గర్ల్‌గా చేయాల్సి రావడమే పెద్ద విషాదం కావచ్చు..