Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాష్ట్రపతి 'ఎట్ హోం' పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా సానియా మిర్జా

President Ram Nath Kovind Hosts At Home Party in Residence, Several Dignitaries Including Sania Mirza Attends Function

హైదరాబాద్: శీతకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం 'ఎట్ హోం' కార్యక్రమంలో భాగంగా విందు ఇచ్చారు. ఈ విందు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులతో పాటు సెలబ్రిటీలు సైతం హాజరయ్యారు.

అయితే, ఈ విందులో ఇటీవలే తల్లి అయిన భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌ దంపతులతో పాటు సానియా మీర్జా తల్లి కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. రామ్‌నాథ్ కోవింద్‌ ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ తన ఇనిస్టాగ్రామ్‌లో ఫోటోను అభిమానులతో పంచుకుంది.

ఈ ఏడాది అక్టోబర్ 30న సానియా మిర్జా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కుమారుడికి సానియా 'ఇజ్‌హాన్' అని పేరు పెట్టింది. అరబిక్‌లో 'దేవుని బహుమతి', 'విశ్వమంత ప్రేమ' అనే అర్థాలు వచ్చేలా కొడుక్కి పేరు పెట్టామని అప్పట్లో సానియా వెల్లడించిన సంగతి తెలిసిందే.

కాగా, రెండున్నర నెలల వయసున్న ఇజాన్‌ మీర్జా మాలిక్‌ నవ్వుతూ చూస్తున్న ఫోటోను సానియా శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ''జీవితం వేగంగా గడిచిపోవడం సరదాగా ఉంటుంది. ప్రపంచానికి హలో చెప్పాల్సిన సమమం వచ్చింది'' అనే కామెంట్‌ను ఆమె పోస్టుకు జతచేసింది.

Story first published: Monday, December 24, 2018, 17:17 [IST]
Other articles published on Dec 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+