Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాప్-100లో చోటు: కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకుకు గుణేశ్వరన్

Prajnesh Gunneswaran breaks top-100 barrier, touches 97

హైదరాబాద్: గత కొన్నాళ్లుగా నిలకడ ప్రదర్శన చేస్తోన్న భారత టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్ అరుదైన ఘతన సాధించాడు. ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ప‍్రజ్నేశ్‌ గుణేశ్వరన్ టాప్-100లో చోటు దక్కించుకున్నాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో ఒక్కసారిగా ఆరు స్థానాలను ఎగబాకిన ప్రజ్నేశ్‌ 97 స్థానంలో నిలిచాడు. దీంతో గత పదేళ్లలో ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో వందలోపు ర్యాంకును సాధించిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

అంతకుముందు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీలు టాప్-100లో చోటు దక్కించుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ మెయిన్‌ డ‍్రాకు ప్రజ్నేశ్‌ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గతవారం జరిగిన ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌ చెన్నై ఓపెన్‌లో ప్రజ్నశ్‌ సెమీస్‌కు చేరాడు.

దాంతో తన పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని టాప్‌-100లో చోటు దక్కించుకున్నాడు. ఇదే ర్యాంక్‌ను ప్రజ్నేశ్‌ కొనసాగిస్తే గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ మెయిన్‌ డ్రాలో ఆడే అవకాశం ఉంటుంది. ఇక, తరచు గాయాల బారిన పడుతున్న మరో భారత ఆటగాడు యూకీ బాంబ్రీ 156వ స్థానంలో కొనసాగుతున్నాడు.

అంతకముందు అనేకసార్లు టాప్‌-100లో చోటు దక్కించుకున్న యూకీ బాంబ్రీని గత కొంతకాలంగా గాయాలు వేధిస్తున్నాయి. దాంతో తన ర్యాంక్‌ను క్రమేపీ కోల్పోతూ వస్తున్నాడు. మరొక భారత ఆటగాడు రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌ ఐదు స్థానాలు ఎగబాకి 128 స్థానాన్ని దక్కించుకున్నాడు.

Story first published: Monday, February 11, 2019, 17:14 [IST]
Other articles published on Feb 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+