న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ టెన్నిస్ తార సానియా మీర్జా పైన కూడా గతంలో చవకబారు జోకులు పేలారట. కేరళ నర్సులపై చేసిన సెక్సియెస్ట్ రిమార్క్స్‌కు క్షమాపణలు చెప్పిన తర్వాత తాజాగా సానియా పైన గతంలో చీప్ జోక్స్ చేశారంటూ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.
సానియా మీర్జా, ఆమె భర్త షోయెబ్ మాలిక్ పైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్‌లు ఇంటర్నెట్లో దర్శనమిస్తున్నాయి. ఆ వీడియోలో కుమార్ విశ్వాస్ ఓ ర్యాలీలోనో లేదా ఓ కవి సమ్మేళనంలోనే మాట్లాడుతున్నట్లుగా ఉంది. అందులో షోయెబ్‌తో సానియా మీర్జా పెళ్లి గురించి ప్రస్తావించారు.

'పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. ఆమె తన కెరీర్‌లో అనుకున్నంత ముందుకు వెళ్లలేకపోతున్నారు. కాబట్టి మరో రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నార'ని కుమార్ విశ్వాస్ చెప్పినట్లుగా అందులో ఉంది. షోయబ్ మాలిక్ పైనా వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఓ హిట్టర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటే భారత్‌కు చెందిన మరొకరిని చేసుకోవాల్సి ఉండెనని వ్యాఖ్యానించినట్లుగా అందులో ఉంది. ఆయన వ్యాఖ్యలు ద్వంద్వార్థంతో కూడినవిగా ఉండటంతో అక్కడున్న వారంతా నవ్వుతూ ఎంజాయ్ చేశారట.