అందులోనే నాకు కిక్కుంది: సానియా (పిక్చర్స్)
హైదరాబాద్: తాను ఎక్కువగా వార్తాపత్రికలు చదవనని, తన ప్రాక్టీస్, తన ఆట... అదే తన లోకమని స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. అత్యుత్తమ ప్రదర్శనలు చేయాలని పరితపిస్తూ ఉంటానని చెప్పారు. అందులోనే తనకు కిక్కుందని చెప్పారు. తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థాయిలో ఉండడం తన అదృష్టమని అన్నారు.
దాన్ని మినహా మిగతా వాటి గురించి, విమర్శలు చేసే ఆ కొద్ది మంది గురించి పట్టించుకోనని, వాళ్లను మినహాయిస్తే యావత్ భారతం తనను ఎంతగానో ప్రేమిస్తోందని, ఆ ప్రేమ ముందు ఈ విమర్శలేపాటి అని సానియా అన్నారు. మార్టినా హింగిస్‌తో కలిసి యూఎస్ ఓపెన్‌లో డబుల్స్ టైటిల్ సాధించి మంగళవారం తెల్లవారుజామున స్వస్థలం హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో సానియాకు కుటుంబసభ్యులు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. తర్వాత మీడియాతో ముచ్చటించిన సానియా, యూఎస్ ఓపెన్ విజయాన్ని దేశ ప్రజలకు అంకితమిస్తున్నానని ప్రకటించింది.

హింగిస్‌తోనే
వచ్చే సీజన్‌లోనూ మార్టినా హింగిస్‌తో తన భాగస్వామ్యం కొనసాగుతుందని, అయితే మిక్స్‌డ్‌లో బ్రూనో సోరెస్(బ్రెజిల్)తో కొనసాగడంపై ఇప్పుడే చెప్పలేనని సానియా మీర్జా అన్నారు.

మా ఇద్దరికీ ఇష్టం
హింగిస్, తాను చక్కని ఆటతీరు ప్రదర్శిస్తున్నామని, ఇద్దరికీ హార్డ్‌కోర్టుపై ఆటంటే చాలా ఇష్టమని, తన ఫేవరెట్ కోర్ట్ అది అని, మ్యాచ్ మ్యాచ్‌కూ మా ఆటను మెరుగుపరుచుకుంటున్నామనిస ఆ క్రమంలోనే టోర్నీలు సాధిస్తూ వెళ్తున్నామని సానియా అన్నారు.

అత్యుత్తమ సీజన్
మొత్తానికి తనకిది అత్యుత్తమ సీజన్ అని, వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించానని, హింగిస్‌తో కలిసి ఈ ఏడాది సీజన్ ముగింపు డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నీ నిలబెట్టుకుంటానన్న విశ్వాసముందని, అంతకంటే ముందు చైనాలో జరిగే బీజింగ్, షాంఘై, గ్వాంగ్జూ ఈవెంట్లలో రాణించాలని సానియా అన్నారు.

మిక్స్‌డ్‌లో ఒలింపిక్స్ మెడల్‌పై గురి
ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో పతకం సాధించే అవకాశాలు చాలా ఉన్నాయని, కానీ ఏం జరుగుతుందో చూద్దామని, చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలని సానియా అన్నారు. దానికి ఇంకా సంవత్సరం ఉంది కదా అని, రియోలో ఏ ఆటగాడితో కలిసి బరిలోకి దిగాలనేది, విశ్వక్రీడల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్నదానిపై కొన్నిరోజుల తర్వాత స్పష్టత వస్తుందని అన్నారు.

సోదరి వివాహ వేడుకల్లో బిజీబిజీ
ఓపెన్ విక్టరీ సెలబ్రేషన్స్ గురించి ఆలోచించడం లేదని, ఎందుకంటే తాను ఇప్పుడు తన సోదరి ఆ నమ్ మీర్జా వివాహ వేడుకల్లో బిజీగా ఉంటానని సానియా చెప్పారు. బుధవారం ఆనమ్ నిశ్చితార్థం జ రుగనుంది. ఇప్పుడంతా ఆ సంబరాల్లో మునిగిపోయామని, ఈ వేడుక ముగిశాక చైనాలో జరిగే డబ్ల్యూటీఏ టోర్నమెంట్లకు వెళ్తానని సానియా చెప్పారు.

సానియా ఇష్టంపైనే!
వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో సానియా మీర్జా ఎవరితో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ ఆడాలనేది ఆమె ఇష్టమని భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న అన్నాడు. సానియా జతగా ఆడాలని తాను కోరుకుంటానని, లియాండర్ కూడా ఆమెతో ఆడాలనుకుంటాడని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications